బిజినెస్

ఎయిరిండియాకు రూ. 1,800 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: నష్టాల్లో కూరుకుపోయిన ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాకు ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయంలో భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఈక్విటీ మద్దతుగా 1,800 కోట్ల రూపాయలు అందుతున్నాయ. ఈ 2016-17 ఆర్థిక సంవత్సరం ఎయిర్ ఇండియాకు కేటాయించిన మొత్తం కన్నా ఇది కాస్త ఎక్కువ. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం పార్లమెంటుకు సమర్పించిన సాధారణ బడ్జెట్‌లో ఈ మొత్తాన్ని కేటాయించారు. ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరానికి 3,911 కోట్ల రూపాయలు కేటాయించాలని ఎయిర్ ఇండియా కోరగా, ప్రభుత్వం మాత్రం 1,713 కోట్ల రూపాయలే కేటాయించింది. కాగా, వచ్చే ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరానికిగాను 2,844 కోట్ల రూపాయలు ఇవ్వాలని ఎయిర్ ఇండియా కోరగా, ప్రభుత్వం 1,800 కోట్ల రూపాయలతో సరిపెట్టింది. దాదాపు 46,570 కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయిన ఎయిర్ ఇండియాను ఆదుకోవడానికి 2012లో అప్పటి యుపిఏ ప్రభుత్వం 30,231 కోట్ల రూపాయల ప్యాకేజిని ప్రకటించినది తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటివరకు ఆ సంస్థకు ప్రభుత్వం నుంచి 24 వేల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందింది.