బిజినెస్

అండర్ 30 శ్రేణి ఫోర్బ్స్ జాబితాలో 45 మంది భారతీయులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, జనవరి 5: ఫోర్బ్స్ ప్రకటించిన ‘30 అండర్ 30’ ఐదో వార్షిక జాబితాలో 45 మంది భారతీయ, భారత సంతతి వ్యక్తులకు చోటు దక్కింది. వివిధ రంగాల్లో గుర్తింపును పొందిన 30 ఏళ్ల వయసు లోపున్నవారితో ఈ జాబితా తయారైంది. కన్జ్యూమర్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్, మీడియా, తయారీ, పారిశ్రామిక, న్యాయ, సామాజిక, శాస్త్ర, సాంకేతిక రంగాల వంటి 20 రంగాలకు చెందిన 600 మంది పురుషులు, మహిళలకు ఈ జాబితాలో స్థానం లభించింది. ఓయో రూమ్స్ సిఇఒ, 22 ఏళ్ల రితేశ్ అగర్వాల్, స్ప్రిగ్ మొబైల్ యాప్ సహ వ్యవస్థాపకులు, 28 ఏళ్ల గగన్ బియాని, నీరాజ్ బెర్రీ, అల్ఫాబెట్ ఉద్యోగి, 25 ఏళ్ల కరిష్మా షాతోపాటు 27 ఏళ్ల లిలి సింగ్, నీలా దాస్, 29 ఏళ్ల దివ్యా నెట్టిమి, వికాస్ పటేల్, నీల్ రాయ్ తదితరులకు చోటు దక్కింది. వీరిలో లిలి సింగ్ హాలీవుడ్ రైటర్-కమెడియన్ అవగా, నీలా దాస్ సిటి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్, దివ్యా నెట్టిమి వికింగ్ గ్లోబల్ ఇనె్వస్టర్స్ ఇనె్వస్ట్‌మెంట్ అనిలిస్. అలాగే వికాస్ పటేల్ మిలీనియం మేనేజ్‌మెంట్ అనలిస్టయితే, నీల్ రాయ్ కాక్స్‌టన్ అసోసియేట్స్ అనలిస్ట్. 30 ఏళ్ల వయసున్న వీరంతా దేశ ఆర్థిక ముఖచిత్రానే్న మార్చేయగల సమర్థులని ఫోర్బ్స్ అభిప్రాయపడింది.