బిజినెస్

రూ. 10 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వచ్చే ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ అనేక పథకాలను ప్రకటించారు. వచ్చే అయిదేళ్లలో వ్యవసాయ ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రభుత్వ యత్నంలో భాగంగా వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ రంగానికి రుణ లక్ష్యాన్ని ఏకంగా 10 లక్షల కోట్ల రూపాయలకు పెంచారు. అంతేకాదు, ఇప్పటివరకు నిర్లక్ష్యానికి గురయిన ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ, కాశ్మీర్‌కు తగినంతగా రుణాలు అందేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా జైట్లీ చెప్పారు. ఏడాదికి 7 శాతం వడ్డీ రేటుపై ప్రభుత్వం రూ.3 లక్షల దాకా స్వల్పకాలిక రుణాలను అందజేస్తుంది. రుణాలను గనుక సకాలంలో చెల్లిస్తే ఈ వడ్డీలో 3 శాతం అదనపు ప్రోత్సాహకం లభిస్తుంది. అంటే వాస్తవానికి 4 శాతానికే రుణం లభించినట్లవుతుంది. కాగా, వర్షాలు బాగా కురిసినందున ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 4.1 శాతం ఉండవచ్చని భావిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. ఖరీఫ్‌తో పాటుగా రబీ సీజన్‌లో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని చెప్పారు. గత ఏడాది ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన’కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో 5,500 కోట్లు కేటాయించగా దాన్ని 13,240 కోట్లకు పెంచినట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో దీనికోసం రూ.9,000 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం కింద సాగుభూమి కవరేజిని ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండిన 30 శాతంనుంచి వచ్చే ఏడాది 40 శాతానికి, ఆ మరుసటి సంవత్సరం 40 శాతానికి పెంచడం జరుగుతుందని జైట్లీ చెప్పారు. రైతులకు అదనపు ఆదాయం ఇచ్చే వాటిలో పాడి పరిశ్రమ ప్రధానమైందని జైట్లీ చెప్తూ రాబోయే మూడేళ్లలో డెయిరీ పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 8 వేల కోట్లతో ఒక నిధిని ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే రూ.5 వేల కోట్లతో మైక్రో ఇరిగేషన్ కోసం ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తారు. కౌలురైతులకోసం కేంద్ర ప్రభుత్వం ఓ మాదిరి చట్టాన్ని రూపొందించి, రాష్ట్రాలకు పంపిస్తుందని కూడా ఆర్థిక మంత్రి తెలిపారు.