బిజినెస్

సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు ప్రియం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది కూడా కేంద్ర బడ్జెట్‌లో ధూమపాన ప్రియులు, పొగాకు వినియోగదారులపైన మరింత భారం వేశారు. సిగరెట్లు, బీడీలు, ఇతర పొగాకు ఉత్పత్తులపై పన్నులను గణనీయంగా పెంచారు. తయారీలోని పొగాకుపైన సుంకాన్ని ఇప్పుడున్న 4.2 శాతం నుంచి 8.3 శాతానికి పెంచారు. పాన్ మసాలాలపై సుంకాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి, ఖైనీ, జర్దా, సెంటెడ్ టుబాకోలాంటి నమిలే పొగాకు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని 6 శాతం నుంచి 12 శాతానికి రెట్టింపు చేశారు. సిగార్, చుట్టలు, పేపర్ రోల్డ్ బీడీలపైనా పన్ను పోటు పడింది.

ఉత్పత్తి లక్ష్యానికి
దూరంగా సింగరేణి
కొత్తగూడెం, ఫిబ్రవరి 1: నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమించటంలో సింగరేణి యాజమాన్యం వెనుకంజలో ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో 66 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, ప్రతికూల పరిస్థితుల కారణంగా ఉత్పత్తి లక్ష్యాన్ని 63 మిలియన్ టన్నులకే పరిమితం చేసుకుంది. అయతే జనవరి నాటికి 48.7 మిలియన్ టన్నులనే సాధించింది. దీంతో ఈ రెండు నెలల్లో 14.3 మిలియన్ టన్నుల ఉత్పత్తిని సాధిస్తేనే లక్ష్యచేధన జరుగుతుంది.
అమర రాజా సంస్థకు
మరో ప్రతిషాఠత్మక అవాఠ్డు
తిరుపతి, ఫిబ్రవరి 1: ఇండస్ట్రియల్, ఆటోమోటివ్ తయారీలో దూసుకెళ్తున్న అమర రాజా బ్యాటరీస్ సంస్థ.. ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరానికిగానూ సిగ్నిఫికెంట్ అచీవ్‌మెంట్ ఇన్ హెచ్‌ఆర్ ఎక్సలెన్స్ అవార్డును కానె్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) నుంచి అందుకుంది. న్యూఢిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును సిఐఐ ప్రెసిడెంట్ ఫోర్బ్స్ మార్షల్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అయిన డాక్టర్ నౌషద్ ఫోర్బ్స్ నుంచి అమర రాజా సంస్థ తరపున హెచ్‌ఆర్ గ్రూప్ అధ్యక్షుడు జయకృష్ణ బి, ఆపరేషన్ విభాగాధిపతి జి జగన్మోహన్, బిజినెస్ హెచ్‌ఆర్ హెడ్ టి దామోదర్ చౌదరి ఈ అవార్డులను తీసుకున్నారు.