బిజినెస్

టెలికామ్ ఆపరేటర్ల పోకడపై ట్రాయ్ దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశీయ టెలికామ్ రంగంలో రోజుకొకటి చొప్పున వస్తున్న ప్రమోషనల్ ఆఫర్లపై, ఆరోగ్యకరంగా లేని పోటీయుత ధరల విధానంపై టెలికామ్ రెగ్యులేటర్ ట్రాయ్ దృష్టి సారించింది. ముకేశ్ అంబానీ నేతృత్వంలోని 4జి సేవల సంస్థ రిలయన్స్ జియో రాకతో టెలికామ్ రంగంలో నిత్యం సంచలనాలు చోటుచేసుకుంటున్నది తెలిసిందే. అప్పటిదాకా కొనసాగిన భారతీ ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా ఆధిపత్యానికి బ్రేకులు పడగా, ఉచిత డేటా-కాల్స్‌తో జియో దూసుకెళ్తోంది. దీంతో మిగతా సంస్థలూ తమ ఇంటర్నెట్ డేటా, కాల్స్ ధరలను భారీగా తగ్గిస్తుండగా, వాటి ఆదాయంపై ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. జియో తీరుపై ఎయిర్‌టెల్, ఐడియా న్యాయపోరాటం కూడా చేస్తుండగా, జియో ప్రమోషనల్ ఆఫర్ల గడువు పెంపునకు ట్రాయ్ ఇస్తున్న మద్దతుపైనా అసంతృప్తితో ఉంటున్నాయి. దీనిపైనా టిడిశాట్‌కు ఫిర్యాదు చేయగా, ఈ మొత్తం పరిణామాల నేపథ్యంలో ఓ అభిప్రాయానికి రావడం కోసం ఇప్పుడు ట్రాయ్.. ‘రెగ్యులేటరీ ప్రిన్సిపుల్స్ ఆఫ్ టారీఫ్ అసెస్‌మెంట్’పై ఓ కన్సల్టేషన్ పేపర్‌లో భాగంగా చర్చకు శ్రీకారం చుట్టింది. పారదర్శకత, వ్యాపార ప్రోత్సాహకాలు, ధరల తీరు, డేటా, కాల్స్ ప్యాకేజీల ప్రకటన తదితర అన్నింటిపైనా కన్సల్టేషన్ పేపర్ ద్వారా ట్రాయ్ సమీక్షించనుంది. ఈ క్రమంలో పరిశ్రమ, ఇతర భాగస్వాముల అభిప్రాయాలను సేకరించనుంది. వచ్చే నెల మార్చి 17లోగా వీటిపై లిఖితపూర్వకంగా తమ అభిప్రాయాలను సమర్పించాలని కోరింది. ఈ మేరకు ట్రాయ్ విడుదల చేసిన ఓ తాజా ప్రకటన తెలియజేసింది.