బిజినెస్

ఒడిదుడుకులకు ఆస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగుస్తుండటం, ఉత్తర్రపదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటం మధ్య మదుపరులు పెట్టుబడులపై స్థిరమైన ఆలోచనలతో ముందుకెళ్లే వీలుండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్) గాను ఆర్థిక ఫలితాల ప్రకటనలు దగ్గరపడటంతో మదుపరులు తమ పెట్టుబడులపై జాతీయ, అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయ. అయతే అలాంటివేమీ ఇప్పటికైతే స్పష్టంగా లేకపోవడంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సరళే మార్కెట్ కదలికలను పెద్దగా ప్రభావితం చేయవచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ వ్యవస్థాపక డైరెక్టర్ విజయ్ సింఘానియా చెబుతున్నారు. ఎన్నికల్లో బిజెపికి స్పష్టమైన మెజారిటీ వస్తే మార్కెట్లు లాభాల్లో పరుగులు పెట్టగలవన్న అభిప్రాయాన్ని కొటక్ సెక్యూరిటీస్ పిసిజి రిసెర్చ్ సీనియర్ ఉపాధ్యక్షుడు దీపెన్ షా వ్యక్తం చేస్తున్నారు. ఇక పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో చోటుచేసుకున్న పరిణామాల నుంచి మార్కెట్ కోలుకుంటుండటంతో ఎఫ్‌ఎమ్‌సిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు మదుపరులను ఆకర్షించవచ్చని మార్కెట్ విశే్లషకులు అంటున్నారు. పాత పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన కరెన్సీ కొరత, ముఖ్యంగా చిల్లర సమస్య కారణంగా వ్యాపారాలు డీలా పడిపోయనది తెలిసిందే. అయతే ప్రస్తుతం డిమానిటైజేషన్ నుంచి మార్కెట్ బయటపడటం, రీమానిటైజేషన్ కొనసాగుతోందని, రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడం మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. మరోవైపు అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలూ మదుపరుల పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయ. ప్రధానంగా విదేశీ వ్యాపారంపైనే ఆధారపడ్డ భారతీయ ఐటి సంస్థలను అమెరికా హెచ్-1బి వీసాల వ్యవహారం ఆందోళనకు గురిచేస్తోంది. వీసాల జారీ అంశానికి సంబంధించి అమెరికా సర్కారు కొత్త మార్పులకు ప్రతిపాదిస్తుండటమే కారణం. కాగా, ఎప్పట్లాగే డాలర్‌తో పోల్చితే రూపాయ మారకం విలువ, విదేశీ మదుపరుల పెట్టుబడులు, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల కదలికలు, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారతీయ స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. గత వారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 134.50 పాయింట్ల్లు పెరిగితే, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 28.15 పాయింట్లు కోలుకుంది. ఫలితంగా వరుసగా నాలుగు వారాలు లాభాల్లో నడిచినట్లైంది. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం కేవలం నాలుగు రోజులే స్టాక్ మార్కెట్ల ట్రేడింగ్ జరగనుంది.