బిజినెస్

గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి మెరుగైన అవకాశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జనవరి 5: గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి అపారమైన అవకాశాలు ఉన్నాయని వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు పేర్కొన్నారు. ఎపి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి గల అవకాశాలు, రాజమహేంద్రవరం విమానాశ్రయ అభివృద్ధి అనే అంశాలపై మంగళవారం సదస్సు జరిగింది. సదస్సుకు ఎపి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి ఉన్న అవకాశాలను వినియోగించుకోగలిగితే సర్వతోముఖాభివృద్ధిని సాధించవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాల్లో ఉన్నన్ని అవకాశాలు మరే జిల్లాలోనూ లేవన్నారు. రాజమహేంద్రవరంలోని విమానాశ్రయాన్ని కూడా అభివృద్ధి చేయాలని, ఇక్కడి నుండే విదేశాలకు కొన్ని విమానాలను నడిపే విధంగా అభివృద్ధిచేస్తే, పర్యాటకంగా కూడా గోదావరి జిల్లాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి, రాజమహేంద్రవరం విమానాశ్రయం అభివృద్ధికి అందరితో కలిసి పనిచేసేందుకు ఎపి చాంబర్ ఆఫ్ కామర్స్ సిద్ధంగా ఉందని, దీనికి స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి జాతీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పర్యాటక రంగం కీలకపాత్రను పోషించబోతోందన్నారు. గోదావరి జిల్లాల్లోని వివిధ ప్రాంతాల అందాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. పుష్కరాల సమయంలో రాజమహేంద్రవరంలోనే 13 రోజులు మకాం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధికి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. గోదావరి జిల్లాల్లో పర్యాటకాభివృద్ధి జరిగితే యువకులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, రాజమహేంద్రవరం విమానాశ్రయాన్ని విస్తరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పటికే భూసేకరణ జరిగి, మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ప్రస్తుతం ఎటిఆర్ విమానాలు అంటే 72 మంది ప్రయాణికులతో నడిచే విమానాలు రాకపోకలు సాగించేందుకు మాత్రమే సౌకర్యాలు ఉన్నాయని, మరింత పెద్ద విమానాలు రాకపోకలు సాగించే విధంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. భవిష్యత్తులో నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ ఆయిలింగ్ వంటి సౌకర్యాలు, కార్గో సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయన్నారు. విమానాశ్రయం అభివృద్ధి చెందితే గోదావరి జిల్లాల్లో పర్యాటకం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రముఖ వైద్య నిపుణుడు, జిఎస్‌ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ 60 కిలోమీటర్ల దూరంలో రకరకాల ప్రకృతి అందాలను తిలకించే అరుదైన అవకాశం రాజమహేంద్రవరం కేంద్రంలో మాత్రమే లభిస్తుందని, అయతే ఈ అవకాశాన్ని వినియోగించుకోవటంలో విఫలమవుతున్నామన్నారు. గోదావరి పాత రైలు వంతెనపై నుండి బంగీ జంప్‌ను కూడా ఏర్పాటు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఎపి చాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు జి సాంబశివరావు, కె లక్ష్మీనారాయణ, పి భాస్కరరావు, దంటు సూర్యారావు తదితరులు పాల్గొన్నారు.