బిజినెస్

గన్నవరం-వారణాసి విమాన సర్వీసు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గన్నవరం, ఫిబ్రవరి 19: నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుండి వారణాసికి స్పైస్‌జెట్‌నూతన విమాన సర్వీసు ఆదివారం కోలాహలంగా ప్రారంభమైంది. 180 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ విమానంలో తొలిసారిగా 156 మంది ప్రయాణికులు వారణాసికి పయనమయ్యారు. కొత్త టెర్మినల్ భవనంలో తొలి బోర్డింగ్ పాస్‌ని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు స్పైస్‌జెట్ ప్రతినిధి ప్రమోద్, డిసిపి శ్రీనివాసరావుతో కలిసి ప్రయాణికులకు అందజేశారు. ఉదయం 10.30 గంటలకు వారణాసి నుండి బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ విమానం గన్నవరం చేరుకుంటుంది. తిరిగి గన్నవరం నుండి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.45 గంటలకు వారణాసి చేరుతుంది. సాధారణంగా రైలు ప్రయాణంలో విజయవాడ నుంచి వారణాసికి 30 గంటల సమయం పడుతోంది. దీంతో ఈ విమాన సర్వీసు అందుబాటులోకి రావడంపట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయ. కాగా, టిక్కెట్ ధర 5 వేల రూపాయలతో ప్రారంభమవుతుందని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ మధుసూదనరావు తెలిపారు.
chitram....
గన్నవరం-వారణాసి స్పైస్‌జెట్ విమానం