బిజినెస్

కొనుగోళ్ల జోష్‌లో మదుపరులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 22: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా లాభాల్లోనే ముగిశాయి. వరుసగా ఐదోరోజు లాభాలను నమోదు చేస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 103.12 పాయింట్లు ఎగిసి 28,864.71 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.05 పాయింట్లు అందుకుని 8,926.90 వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ విలువ 10.97 శాతం ఎగబాకి 1,207.65 వద్దకు చేరింది. ఏప్రిల్ నుంచి రిలయన్స్ జియో డేటా చార్జీలను వసూలు చేయనుండటంతో మదుపరులు రిలయన్స్ షేర్ల కొనుగోళ్లకు అమితాసక్తిని కనబరిచారు. ఈ క్రమంలో టెలికామ్ షేర్లన్నీ కూడా లాభాల్లో కదలాడగా, ఎనర్జీ, చమురు, గ్యాస్, బ్యాంకింగ్ రంగాల షేర్లకూ కొనుగోళ్ల మద్దతు లభించింది. అయితే ఐటి, యుటిలిటిస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, టెక్నాలజీ, పవర్, హెల్త్‌కేర్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఆసియా మార్కెట్లలో హాంకాంగ్, చైనా సూచీలు లాభపడగా, జపాన్ సూచీ స్థిరంగా ఉంది. ఐరోపా మార్కెట్లలో ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు లాభపడ్డాయి.
బిఇఎల్ షేర్లకు అపూర్వ స్పందన
మరోవైపు ప్రభుత్వరంగ ఏరోస్పేస్, డిఫెన్స్ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బిఇఎల్) షేర్ల విక్రయానికి మదుపరుల నుంచి అపూర్వ స్పందన లభించింది. తొలిరోజే సంస్థాగత మదుపరులు 3,100 కోట్ల రూపాయలకుపైగా బిడ్లను దాఖలు చేశారు. 1.11 కోట్ల షేర్లకు 2.09 కోట్ల షేర్లకు సరిపడా బిడ్లు వచ్చాయి. బిఇఎల్‌లో 5 శాతం వాటాను కేంద్ర ప్రభుత్వం అమ్ముతోంది. ఈ వాటా విక్రయంతో ఖజానాకు 1,600 కోట్ల నిధులు వస్తాయని అంచనా.