బిజినెస్

ఈ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ పరుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 22: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వేగవంతంగా జరుగుతున్న కొత్త నోట్ల సరఫరాతో ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పరుగులు పెట్టగలదన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో భారత జిడిపి వృద్ధిరేటు మందగించి 6.6 శాతంగా ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) అంచనా వేసింది. ఎస్‌బిఐ రిసెర్చ్ కూడా ఇదే అంచనాను వెలిబుచ్చగా, నిరుడు అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి 5.8 శాతం వృద్ధిరేటును అంచనా వేసింది. ఈ జనవరి-మార్చికి మాత్రం 6.4 శాతంగా నమోదు కావచ్చని పేర్కొంది. ఈ నెల 28న కేంద్ర ప్రభుత్వం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికిగాను జిడిపి వృద్ధిరేటు గణాంకాలను విడుదల చేయనుంది.
వృద్ధులకు ఐటి శాఖ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఆదాయ పన్ను (ఐటి) శాఖ.. 70 ఏళ్లకుపైబడిన వయసువారికి నగదు డిపాజిట్లలో మినహాయింపునిచ్చింది. పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో జరిగిన డిపాజిట్లలో 5 లక్షల రూపాయల వరకున్న డిపాజిట్లకు సంబంధించి వారికి ఎలాంటి విచారణలుండవని చెప్పిం ది. ఇతరులు మాత్రం 2.50 లక్షల రూపాయలకు మించి డిపాజిట్ చేస్తే వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
గ్రీన్‌కో విండ్ మిల్స్ కంపెనీలో ఐటి సోదాలు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఫిబ్రవరి 22: హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లోని గ్రీన్‌కో విండ్ మిల్స్ కంపెనీలో బుధవారం ఆదాయపు పన్ను (ఐటి) శాఖ అధికారులు సోదాలు జరిపారు. బ్యాంకు రుణాల విషయంలో అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. కాగా గ్రీన్‌కో కంపెనీ సిఇఒ చెలమశెట్టి అనిల్ కుమార్, చీఫ్ అకౌంటెంట్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు ఓ సీనియర్ ఐటి అధికారి తెలిపారు.
నగదు రహిత నగరంగా విశాఖపట్నం
వీసాతో ఎపి సర్కారు ఎమ్‌ఒయు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: దేశంలోనే తొలి నగదు రహిత నగరంగా విశాఖపట్నంను తీర్చిదిద్దడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో గ్లోబల్ పేమెంట్స్ నెట్‌వర్క్ వీసా.. బుధవారం ఓ అవగాహనా ఒప్పందాన్ని (ఎమ్‌ఒయు) కుదుర్చుకుంది. భారతీయ ‘్ఫన్‌టెక్ వ్యాలీ’గా విశాఖను మలచడానికి వీసాతో ఏర్పరచుకున్న తాజా ఎమ్‌ఒయు ఎంతగానో దోహదపడగలదన్న విశ్వాసాన్ని ఈ సందర్భంగా ఎపి సర్కారు ఓ ప్రకటనలో వ్యక్తం చేసింది. ‘ఈ ప్రాజెక్టుతో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తున్న వ్యాపారులు మూడు నుంచి ఐదు రెట్లు పెరుగుతారని భావిస్తున్నాం. ఎలక్ట్రానిక్ లావాదేవీలు జరిపే వినియోగదారులూ 75 నుంచి 100 శాతానికి చేరుతారని అనుకుంటున్నాం.’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు.