బిజినెస్

‘కొత్త వెయ్యి నోట్లు రావు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: కొత్తగా వెయ్యి రూపాయల నోట్లను తెచ్చే ఉద్దేశమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. కొత్తగా మళ్లీ 1,000 రూపాయల నోట్లు వస్తున్నాయన్న ఊహాగానాల మధ్య పైవిధంగా స్పందించింది. కాగా, 500 రూపాయల నోట్లు, అంతకంటే తక్కువ విలువైన నోట్ల సరఫరాను పెంచే దిశగానే వెళ్తున్నామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు. అయితే ఇప్పటికైతే నగదు నిల్వలు సరిపడా ఉన్నాయని, దేశవ్యాప్తంగా అన్ని ఎటిఎమ్‌లను కొత్త నోట్ల పంపిణీకి అనుగుణంగా మార్చుతున్నామని తెలిపారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలనకు నిరుడు నవంబర్ 8న పాత 500, 1,000 రూపాయల నోట్లను కేంద్రం రద్దు చేసినది తెలిసిందే.