క్రీడాభూమి

క్రికెటర్ల ఫీజులో భారీ పెరుగుదల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: సెంట్రల్ కాంట్రాక్టు పొందిన క్రికెటర్ల ఫీజు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. పాలనా వ్యవహారాలను పరిశీలించడానికి సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన నలుగు సభ్యులతో కూడిన కమిటీ (సిఒఎ)కు బిసిసిఐ ఒక ప్రతిపాదన పంపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న కాంట్రాక్టు ప్రకారం గ్రేడ్ ‘ఎ’ ఆటగాళ్లకు ఏటా కోటి రూపాయల ఫీజు లభిస్తుంది. ‘బి’ గ్రేడ్ క్రికెటర్లకు 60 లక్షలు, ‘సి’ గ్రేడ్‌లో ఉన్నవారికి 35 లక్షల చొప్పున ఫీజు చెల్లిస్తున్నారు. టెస్టుల్లో తుది జట్టులో చోటు దక్కించుకున్న ఆటగాళ్లందరికీ తలా 15 లక్షల చొప్పున ఇస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన ఐపిఎల్ వేలంలో చటేశ్వర్ పుజారా, ఇశాంత్ శర్మ వంటి ఆటగాళ్లకు చోటు దక్కకపోవడం, తంగరసు నటరాజ్‌కు మూడు కోట్లు, మహమ్మద్ సిరాజ్‌కు ఎవరూ ఊహించని విధంగా 2.6 కోట్ల రూపాయలు దక్కడం బిసిసిఐని ఆలోచనలో పడేసింది. పుజారా టెస్టు క్రికెట్‌లో మూడు వేలకుపైగా పరుగులు సాధించాడు. పది శతకాలు కూడా కొట్టాడు. ఇశాంత్ శర్మ రెండు వందలకంటే ఎక్కువ వికెట్లు కూల్చాడు. కానీ, వారిపై ఫ్రాంచైజీలు ఆసక్తిని చూపకపోవడం చర్చనీయాంశమైంది. ఐపిఎల్‌లో లభిస్తున్న మొత్తాలను దృష్టిలో ఉంచుకొని, కాంట్రాక్టులో ఉన్న క్రికెటర్లకు ఫీజును పెంచాలని బిసిసిఐ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనను సిఒఎకు పంపిందని, త్వరలోనే ఒక నిర్ణయం వెలువడుతుందని సమాచారం. మొత్తం మీద క్రికెటర్ల పారితోషికానికి రెక్కలు రానున్నాయ.

టేలర్ సూపర్ సెంచరీ
రెండో వనే్డలో దక్షిణాఫ్రికాపై కివీస్ విజయం
క్రైస్ట్‌చర్చి, ఫిబ్రవరి 22: దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన రెండో వనే్డ ఇంటర్నేషనల్‌ను న్యూజిలాండ్ ఆరు పరుగుల తేడాతో గెల్చుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-1గా దక్షిణాఫ్రికాతో సమవుజ్జీగా నిలిచింది. మాజీ కెప్టెన్ రాస్ టేలర్ ఇన్నింగ్స్ చివరి బంతిలో ఫోర్ కొట్టి, రికార్డు సెంచరీ సాధించడం విశేషం. కివీస్ నాలుగు వికెట్లకు 289 పరుగులు సాధించగా, లక్ష్యాన్ని ఛేదించడానికి చివరి వరకూ ప్రయత్నించిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేయగలిగింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 13 పరుగుల వద్ద మొదటి వికెట్‌ను టామ్ లాథమ్ (2) రూపంలో కోల్పోయింది. మరో 40 పరుగుల తర్వాత డీన్ బ్రౌన్లీ (34) కూడా వెనుదిరిగాడు. ఈ దశలో కెప్టెన్ కేన్ విలియమ్‌సమ్, రాస్ టేలర్ కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. విలియమ్‌సన్ 69 పరుగులు చేసి అవుట్‌కాగా, నీల్ బ్రూమ్ రెండు పరుగులకే అవుటయ్యాడు. చివరిలో జేమ్స్ నీషమ్ (71 నాటౌట్)తో కలిసి మరో క్రీజ్‌లో నిలిచిన టేలర్ ఇన్నింగ్స్ చివరి బంతిని బౌండరీకి తరలించి, కెరీర్‌లో 17వ వనే్డ సెంచరీని సాధించాడు. ఈ ఫార్మాట్‌లో న్యూజిలాండ్ తరఫున అత్యధిక శతకాలు చేసిన బ్యాట్స్‌మన్‌గా నాథన్ ఆస్టల్ (16) రికార్డును టేలర్ అధిగమించాడు.
న్యూజిలాండ్‌ను ఓడించి, సిరీస్‌పై ఆధిక్యాన్ని పెంచుకోవాలన్న లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా పరుగుల వేటలో తడబడింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (57), లోయల్ మిడిల్ ఆర్డర్‌లో త్వెయిన్ ప్రిటోరియస్ (50) అర్ధ శతకాలు సాధించినప్పటికీ, లక్ష్యానికి ఏడు పరుగుల దూరంలోనే ఆగిపోయంది. ఆరు పరుగుల తేడాతో ఓడింది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 4 విక్లెకు 289 (కేన్ విలియమ్‌సన్ 69, రాస్ టేలర్ 102 నాటౌట్, డ్వెయిన్ ప్రిటోరియస్ 2/40).
దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: 50 ఓవర్లలో 9 వికెట్లకు 283 (క్వింటన్ డికాక్ 57, డ్వెయిన్ ప్రిటోరియస్ 50, ఎబి డివిలియర్స్ 45, జెపి డుమినీ 34, ట్రెంట్ బౌల్ట్ 3/63, మిచెల్ సాంట్నర్ 2/46).