బిజినెస్

ఉత్పత్తి, రవాణాలో సింగరేణి ఆల్‌టైం రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: ఉత్పత్తి లక్ష్యాల సాధనలో దూసుకుపోతున్న సింగరేణి.. ఫిబ్రవరిలో బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాలో ఆల్‌టైం రికార్డు సృష్టించింది. సింగరేణి చరిత్రలోనే ఫిబ్రవరిలో అత్యధికంగా 58.7 లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి చేయగా, 57 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసి మరో కొత్త రికార్డు నెలకొల్పింది. ఇందుకుగాను సింగరేణి సిఎండి ఎన్ శ్రీధర్ సిబ్బందిని, కార్మికులను, అధికారులను బుధవారం ఒక ప్రకటనలో అభినందించారు. నిరుడు ఫిబ్రవరిలో 53.7 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవగా, ఈ ఏడాది 9.31 శాతం అధికంగా, అంటే 58.7 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి చేసినట్లు ఆ ప్రకటనలో తెలిపారు. అలాగే నిరుడు ఫిబ్రవరిలో 54.2 లక్షల మెట్రిక్ టన్నులు రవాణా చేయగా, ఈ ఏడాది 57 లక్షల మెట్రిక్ టన్నులు రవాణా చేసి 26.11 శాతం వృద్ధిరేటు నమోదు చేసిందని వెల్లడించారు. అంతేగాకుండా ఫిబ్రవరి 28న ఒక్కరోజే 41 ర్యాక్‌ల రవాణా ద్వారా 2.31 లక్షల టన్నులు పంపిణీ జరిగిందని సిఎండి ఆ ప్రకటనలో వెల్లడించారు. అలాగే నిరుడు ఏప్రిల్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు నిర్ధేశించుకున్న 524.4 లక్షల టన్నుల ఉత్పత్తికి 541.6 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగిందని, 103 శాతం వృద్ధి సాధించామని చెప్పారు.