బిజినెస్

వేసినా.. తీసినా వాతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 1: పాత పెద్ద నోట్ల రద్దు కష్టాలు కొలిక్కి రావడం, నగదు రహిత ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలనే లక్ష్యంతో ఖాతాదారుల నగదు లావాదేవీలపై ప్రైవేట్‌రంగ బ్యాంకులు పెను భారం మోపాయి. నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు నెలలో నాలుగుసార్లు మించితే ఒక్కో లావాదేవికి ఏకంగా 150 రూపాయలను వసూలు చేస్తామని ప్రకటించాయి. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ దిగ్గజాలైన హెచ్‌డిఎఫ్‌సి, ఐసిఐసిఐ, యాక్సిస్‌లు కనీసం 150 రూపాయల చార్జీని వసూలు చేస్తామని బుధవారం ప్రకటించాయి. సేవింగ్స్ ఖాతాలతోపాటు వేతన ఖాతాదారులకు (సాలరీ అకౌంట్స్) ఈ చార్జీలు వర్తిస్తాయని, బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఓ సర్క్యులర్ జారీ చేసింది. అలాగే రోజుకు థర్డ్ పార్టీ నగదు లావాదేవీలు 25,000 రూపాయలు మించరాదని కూడా షరతు విధించింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నగదు కొరత, డిజిటల్ లావాదేవీలకు ఊతమివ్వాలన్న కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) ప్రకటనలతోనే బ్యాంకులు ఈ స్థాయిలో చార్జీలను వసూలు చేసేందుకు సిద్ధమయ్యాయి. నిజానికి పాత పెద్ద నోట్ల రద్దుకు ముందు కేవలం ఎటిఎమ్ లావాదేవీలపైనే పరిమితులు, చార్జీలు ఉండేవి. అప్పుడు అదనంగా జరిగిన ఒక్కో లావాదేవీకి 20 రూపాయల వరకు చార్జ్ చేసేవి బ్యాంకులు. కానీ ఇప్పుడు ఆ చార్జీని దాదాపు ఎనిమిది రెట్లు పెంచిన బ్యాంకులు.. నగదు డిపాజిట్లపైనా కొరడా ఝుళిపించాయి. కాగా, సొంత బ్యాంక్ శాఖల్లో నెలకు నాలుగుసార్లు ఉచితంగానే నగదు లావాదేవీలు జరుపుకోవచ్చని, అవి దాటితే ప్రతి వెయ్యి రూపాయలకు 5 రూపాయల చొప్పున కనీసం 150 రూపాయల వరకు చార్జ్ తీసుకుంటామని ఐసిఐసిఐ బ్యాంక్ తెలిపింది. ఇతర బ్యాంకుల వారికి తొలి నగదు ఉపసంహరణ ఉచితమని చెప్పిన ఐసిఐసిఐ.. ఆ తర్వాత చార్జీలు వర్తిస్తాయంది. నగదు డిపాజిట్లకు మాత్రం చార్జీలు తప్పవంది. అయితే క్యాష్ డిపాజిట్ మెషీన్ ద్వారానైతే తొలిసారి ఉచితమని, ఆ తర్వాత చార్జీలు యథాతథమంది. కాగా, థర్డ్ పార్టీ నగదు లావాదేవీ పరిమితిని 50,000 రూపాయలుగా నిర్ణయించింది. మరోవైపు సొంత బ్యాంక్ ఎటిఎమ్‌లు కాకుండా కనిపించిన ఇతర బ్యాంక్ ఎటిఎమ్‌లలో లావాదేవీలు చేస్తే కూడా గతంలో మాదిరిగా ఇకపై చార్జీలు వర్తిస్తాయి. ఇదిలావుంటే యాక్సిస్ బ్యాంక్ నెలకు తొలి ఐదు లావాదేవీలు లేదా 10 లక్షల రూపాయల వరకు నగదు డిపాజిట్లు, ఉపసంహరణలు ఉచితమని ప్రకటించింది. ఆ తర్వాత వెయ్యికి 5 రూపాయల చొప్పున కనీసం 150 రూపాయల వరకు చార్జ్ చేస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వరంగ బ్యాంకులు మాత్రం తమకు ఈ తరహా చార్జీలకు సంబంధించి ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదంటున్నాయి. ఈ మేరకు ఓ సీనియర్ అధికారి చెప్పారు.
తగ్గిన సనోఫి ఇండియా లాభం
న్యూఢిల్లీ, మార్చి 1: ఔషథ రంగ సంస్థ సనోఫి ఇండియా నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో గతంతో పోల్చితే 58 శాతం క్షీణించి 50.5 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 120.2 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఈ మేరకు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సనోఫి ఇండియా తెలియజేసింది. నికర అమ్మకాలు ఈసారి 592 కోట్ల రూపాయలుగా, పోయినసారి 568.7 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. సంస్థాగత ఖర్చులు మాత్రం క్రిందటిసారితో చూస్తే 485.4 కోట్ల రూపాయల నుంచి 525.9 కోట్ల రూపాయలకు ఎగిశాయి.