బిజినెస్

ఈసారైన కొనేవారుంటారా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 5: కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన రెండు ప్రధాన స్థిరాస్తులను బ్యాంకులు సోమవారం వేలం వేయనున్నాయ. లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్.. బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయలకుపైగా బకాయ పడినది తెలిసిందే. తీసుకున్న రుణాలను చెల్లించలేక మాల్యా లండన్‌కు పారిపోగా, ఇచ్చిన రుణాలను వసూలు చేసుకోవడంలో భాగంగా తాకట్టు పెట్టిన ఆస్తులను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు బ్యాంకర్లు. అయతే ఇప్పటికే పలుమార్లు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ స్థిర,చరాస్తులను వేలం వేసిన బ్యాంకులకు భంగపాటు ఎదురవగా, వాటిని అమ్మేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయ.
చివరకు వేలానికి వేలానికి ఆస్తుల ధరలను తగ్గిస్తున్నా ఫలితం శూన్యం. ఇక సోమవారం ముంబయలోని కింగ్‌ఫిషర్ హౌస్‌ను, గోవాలోని కింగ్‌ఫిషర్ విల్లాను బ్యాంకులు వేలానికి తెస్తుండగా, కింగ్‌ఫిషర్ హౌస్‌ను వేలం వేయడం ఇది నాలుగోసారి. అలాగే కింగ్‌ఫిషర్ విల్లా వేలం మూడోసారి. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనాసరే వేలం విజయవంతం కావాలని చూస్తున్న బ్యాంకర్లు.. వీటి ధరలనూ గత వేలంతో పోల్చితే మరింతగా తగ్గించారు. కింగ్‌ఫిషర్ హౌస్ ధరను 103.50 కోట్ల రూపాయలుగా నిర్ణయంచారు. నిజానికి నిరుడు మార్చిలో తొలిసారి నిర్వహించిన వేలంలో దీని ధర 150 కోట్ల రూపాయలుగా ఉంది. నాడు స్పందన కరువవడంతో రెండోసారి ఆగస్టులో వేసిన వేలంలో 135 కోట్ల రూపాయలకు తగ్గించారు. అయనా ఫలితం లేకపోవడంతో మూడోసారి డిసెంబర్ వేలంలో 115 కోట్ల రూపాయలకు తీసుకొచ్చారు. అప్పుడు కూడా బ్యాంకులకు నిరాశే ఎదురవడంతో ఇప్పుడు 10 శాతం మేర ధర తగ్గించి 103.50 కోట్ల రూపాయలుగా నిర్ణయంచారు. ముంబయ జాతీయ విమానాశ్రయం దగ్గర్లోగల విలే పార్లే ప్రాంతంలో 17 వేల చదరపు అడుగుల్లో నిర్మితమైంది కింగ్‌ఫిషర్ హౌస్. ఇదిలావుంటే కింగ్‌ఫిషర్ విల్లా విషయానికొస్తే దీని ధరను 73 కోట్ల రూపాయలకు తగ్గించాయ బ్యాంకులు. నిరుడు డిసెంబర్ నెల వేలంలో 81 కోట్ల రూపాయలుగా ఉన్న దీని ధర.. అక్టోబర్‌లో 85.29 కోట్ల రూపాయలుగా ఉంది. ఉత్తర గోవాలోని కండోలిమ్ వద్దగల కింగ్‌ఫిషర్ విల్లా 12,350 చదరపు గజాల్లో నిర్మించారు. విజయ్ మాల్యా విలాసవంతమైన జీవితానికి ఈ విల్లా ప్రతిరూపంగా నిలుస్తుంది. అబ్బుపరిచే ఇంటీరియర్ డిజైనింగ్ దీని సొంతం. సకల సౌకర్యాలున్న ఈ విల్లా కూడా వేలంలో కొనుగోలుదారులను ఆకర్షించలేకపోతుండటం బ్యాంకర్ల తోపాటు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కూటమి ఈ వేలానికి దిగుతుండగా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అలహాబాద్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ తదితర బ్యాంకులు ఈ కూటమిలో ఉన్నాయ. అయతే బ్యాంకర్ల తరఫున ఎస్‌బిఐ క్యాపిటల్ ట్రస్టీ వేలాలను నిర్వహిస్తోంది. మాల్యా దేశం విడిచి పారిపోయన నేపథ్యంలో ఆయన్ను ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా కూడా పలు బ్యాంకులు ప్రకటించగా, ఈ వ్యవహారం కోర్టుల్లోకి కూడా చేరింది.
బకాయిల వసూళ్లలో భాగంగా మాల్యా ఇండ్లు, కార్లు, వ్యక్తిగత విమానం ఇలా అన్నింటినీ బ్యాంకులు, ఆదాయ, వాణిజ్య, సేవా పన్ను శాఖలు వేలం వేస్తున్నప్పటికీ కొనేవారే కరువయ్యారు. కాగా, నిరుడు మార్చి 3న లండన్‌కు మాల్యా చెప్పాపెట్టకుండా పారిపోగా, అడపాదడపా ట్విట్టర్‌లో స్పందిస్తున్నారు. ఇటీవల కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దుస్థితికి లోపభూయష్టమైన ఇంజిన్లూ కారణమేనని మాల్యా ట్వీట్ చేశారు. కింగ్‌ఫిషర్‌కు ప్రాట్ అండ్ వైట్నీ గ్రూప్‌నకు చెందిన ఓ సంస్థ లోపాలున్న ఇంజిన్లను సరఫరా చేసిందని చెప్పారు. దేశీయంగా కొన్ని ఎయిర్‌బస్ 320 నియో విమానాలు ప్రాట్ అండ్ వైట్నీ రూపొందించిన ఇంజిన్లతోనే నడుస్తున్న క్రమంలో దీనిపై డిజిసిఎ సమగ్ర తనిఖీలకు ఆదేశించిన నేపథ్యంలో మాల్యా పైవిధంగా స్పందించారు. డిజిసిఎ ఆదేశాలు ఆశ్చర్యకరంగా లేవని, ప్రాట్ అండ్ వైట్నీ ఇంజిన్లతోనే కింగ్‌ఫిషర్ విమానాలు మూలనపడటం బాధాకరమని ఆయన ట్విట్టర్‌లో అన్నారు. 2012లో దేశీయ ప్రైవేట్‌రంగ సంస్థ అయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సేవలు నిలిచిపోయాయి.