బిజినెస్

కుటీర పరిశ్రమగా మామిడి తాండ్ర తయారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మార్చి 11: ఆంధ్ర రాష్ట్రంలో మామిడి తాండ్ర తయారీలో అగ్రభాగాన ఉన్న తూర్పుగోదావరి జిల్లాలో మామిడి తాండ్ర తయారీదారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. మామిడి తాండ్ర తయారీ కేంద్రాలను కుటీర పరిశ్రమగా గుర్తించి, నాణ్యమైన ఉత్పత్తులు సాధించడంతోపాటు పెద్ద ఎత్తున మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ప్రస్తుత సీజన్‌లో మామిడి పూత అధికంగా ఉండటంతో 50 నుండి 60 శాతం ఉత్పత్తి ద్వారా సుమారు 70 వేల టన్నుల మామిడి ఉత్పత్తిని అధికారులు అంచనా వేస్తున్నారు.
పంట దిగుబడిపై రైతులకు అవగాహన కల్పించడంతోపాటు ఉద్యానవన శాస్తవ్రేత్తలు, అనుభవం కలిగిన రైతుల సహాయంతో మామిడి దిగుబడి అనుకున్న రీతిలో లభించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో మామిడి తాండ్ర తయారీకి అధిక శాతం మామిడి పండ్లు సేకరించేందుకు తయారీదార్లు సిద్ధమవుతున్నారు. పెరిగిన దిగుబడిని దృష్టిలో ఉంచుకుని పెద్ద ఎత్తున మామిడి తాండ్ర తయారీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మామిడి తాండ్ర ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ యంత్రాంగం చర్యలు చేపట్టింది. కుటీర పరిశ్రమగా అభివృద్ధి చేసిన పక్షంలో ఉపాధికి ఊతం లభిస్తుందని, ఆదాయపరంగానూ ఆశించిన ఫలితాలుంటాయని భావిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం తొండంగి, సర్పవరం, పండూరు, కోరుకొండ, ఆత్రేయపురం తదితర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తాండ్ర తయారవుతోంది. ఈ గ్రామాల్లో ఉన్న తయారీ కేంద్రాలను ఇకపై కుటీర పరిశ్రమలుగా ప్రోత్సహించనున్నారు.
ఏటా వేసవి సీజన్‌లో ఈ ప్రాంతాలకు చెందిన వేలాది మంది మామిడి తాండ్రను తయారుచేస్తున్నారు. వివిధ గ్రేడుల్లో మామిడి తాండ్ర ఇక్కడ తయారవుతోంది. ఇక్కడి తాండ్రకు జాతీయ స్థాయిలో పేరుంది. కుటీర పరిశ్రమల ప్రోత్సాహంలో భాగంగా ఉత్పత్తిదారులకు అవసరమైన మెళకువలపై శిక్షణ ఇవ్వనున్నారు. సోలార్ డ్రయ్యర్ల వినియోగం ద్వారా తాండ్రను మరింత వేగంగా, నాణ్యవంతంగా తయారుచేయడానికి సహకరిస్తారు. ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉత్పత్తిదారులకు ప్రభుత్వం అందించనుంది. మామిడి తాండ్రపై సమగ్ర అధ్యయనానికి ఓ కన్సల్టెన్సీని నియమించడంతోపాటు జిల్లాకు వినూత్న కార్యక్రమాల అమలు కోసం విడుదల చేసిన నిధులను వెచ్చించాలని నిర్ణయించారు. ఈ అధ్యయనం ద్వారా వచ్చే సూచనలను అమలు చేయడం ద్వారా మామిడితాండ్రపై ఆధారపడిన కుటుంబాలకు అవసరమైన రుణ సహకారాన్ని అందించడానికి ప్రభుత్వ యంత్రాంగం ముందుకువచ్చింది. ఇందుకు ఉద్యానవన శాఖాధికారుల ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తున్నారు.