బిజినెస్

కొత్త నోట్ల ఖర్చెంతో తెలుసా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముద్రణ వ్యయాన్ని వెల్లడించిన కేంద్రం
రూ. 2.87తో 500 నోటు
రూ. 3.77తో 2,000 నోటు ప్రింటింగ్

న్యూఢిల్లీ, మార్చి 15: కొత్త 500, 2,000 రూపాయల నోట్ల ముద్రణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలియజేసింది. ఒక్కో 500 రూపాయల నోటు ముద్రణ ఖర్చు 2 రూపాయల 87 పైసలుగా ఉందని, 2,000 రూపాయల నోటు ముద్రణ ఖర్చు 3 రూపాయల 77 పైసలు అవుతోందని రాజ్యసభకు లిఖితపూర్వక సమాధానంగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ చెప్పారు.
నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించినది తెలిసిందే. దీంతో అప్పటిదాకా ఉన్న 500, 1,000 రూపాయల నోట్ల చలామణి నిలిచిపోగా, వాటిని బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని అంతే విలువైన కొత్త నోట్లను తీసుకోవచ్చని కూడా మోదీ తెలిపారు. ఈ క్రమంలోనే కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను ముద్రిస్తున్నారు. పాత పెద్ద నోట్లతో పోల్చితే వీటి పరిమాణం తక్కువే అయినప్పటికీ, వీటిలో భద్రతా ప్రమాణాలు మాత్రం ఎక్కువే. కాగా, గత నెల ఫిబ్రవరి 24 నాటికి చలామణిలోగల భారతీయ కరెన్సీ 11.64 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. నిరుడు డిసెంబర్ 10 నాటికి రద్దయిన పాత నోట్ల విలువ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) వద్ద 12.44 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. పాత పెద్ద నోట్ల రద్దు నాటికి దేశ కరెన్సీలో వాటి విలువ 86 శాతం. ఇకపోతే కొత్త నోట్లకు అనుగుణంగా దేశంలోని మొత్తం 2.18 లక్షల ఎటిఎమ్‌లను మార్చే పనిలో బ్యాంకులు నిమగ్నమవగా, ఈ ఏడాది జనవరి 4 నాటికి 1.98 లక్షల ఎటిఎమ్‌లను మార్చేశాయి.