బిజినెస్

ఐటి రంగంలో హైదరాబాద్ దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోనే రెండో స్థానం
ద్వితీయ శ్రేణి పట్టణాలకూ వేగంగా విస్తరణ
మండలిలో తెలంగాణ ఐటి మంత్రి కెటిఆర్

హైదరాబాద్, మార్చి 15: ఐటి రంగంలో హైదరాబాద్ దేశంలోనే రెండో స్థానంలో ఉందని మంత్రి కెటిఆర్ ప్రకటించారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బుధవారం శాసన మండలిలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ఐటిఐఆర్ వచ్చినా.. రాకపోయినా ఐటి రంగంలో తెలంగాణ ఆగ్రగామిగా నిలుస్తుందన్నారు. దేశీయ ఐటి రంగంలో బెంగళూరు తర్వాత హైదరాబాదేనన్నారు.
పరోక్షంగా నాలుగు లక్షలు, ప్రత్యక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐటిఐఆర్‌పై ఇప్పటికే కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిసి వివరించామని తెలిపారు. రూరల్ టెక్నాలజీ పాలసీ కింద ద్వితీయ శ్రేణి పట్టణాలైన వరంగల్‌లో కాకతీయ మెగా టెక్నాలజీ పార్కు, సిద్దిపేట్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమలు, జనగామ, సిరిసిల్లల్లో ఫుడ్‌పార్కులు, సిరిసిల్లలో చేనేత పరిశ్రమను అభివృద్ధి చేస్తూ ప్రతి జిల్లాకి ఊతమిచ్చేవిధంగా పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కాగా, ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బిజెపి సభ్యుడు రామచందర్‌రావు తెలపగా, వారికి 211 కోట్ల రూపాయల నిధులను త్వరలో మంజూరు చేయనున్నట్లు పేర్కొన్నారు.
మరోవైపు గ్రామ జ్యోతి పథకం కింద ‘మన ఊరు-మన ప్రణాళిక’ పై ప్రచారం తప్ప నిధులెక్కడ అని ప్రతిపక్ష సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మహమ్మద్ అలీ షబ్బీర్ ధ్వజమెత్తారు. నిధుల కొరతతో గ్రామాలు అభివృద్ధిలో కుంటుపడ్డాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి ధ్యేయంగా గ్రామ జ్యోతి పథకం పని చేస్తుందన్నారు. సాగు, మంచి నీరు, విద్య, వైద్యం, పారిశుద్ధ్యం వంటి వౌలిక వసతులతో వెలుగులు నింపుతున్నట్లు పేర్కొన్నారు.
అలాగే తెలంగాణ రాష్ట్రంలోని 8,882 గ్రామ పంచాయతీలలో బిటి రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఇప్పటికే రోడ్ల అభివృద్ధికి 4,800 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. 1,756 గిరిజన తండాలలో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని అధికార పార్టీ సభ్యుడు రాములు నాయక్ ఆరోపించగా, మూల మలుపు రహదార్లలో ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సూచించారు.
దీంతో రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించామని, దశల వారిగా పనులు జరుగుతాయని మంత్రి జూపల్లి వివరించారు.