బిజినెస్

ట్యాక్స్ రిటర్న్స్ వివాదంలో ట్రంప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 15: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. 2005లో 38 మిలియన్ డాలర్ల పన్నులను చెల్లించారు. 150 మిలియన్ డార్లకుపైగా ఉన్న తన ఆదాయంపై ఈ మేరకు పన్నులను ట్రంప్ చెల్లించినట్లు వైట్‌హౌజ్ వర్గాలు బుధవారం తెలిపాయి. ఓ ప్రజాదరణ పొందిన టెలివిజన్ షోలో ట్రంప్ ట్యాక్స్ రిటర్న్స్‌పై కథనం రావడంతో వైట్‌హౌజ్ పైవిధంగా స్పందించింది. మంగళవారం రాత్రి రాచెల్ మ్యాడోస్ షోలో ప్రతిష్ఠాత్మక పులిట్జర్ అవార్డు గ్రహీత, సీనియర్ జర్నలిస్ట్ డేవిడ్ కే జాన్సన్.. 2005లో ట్రంప్ ట్యాక్స్ రిటర్న్స్‌కు సంబంధించి రెండు పేజీలను బహీర్గతం చేశారు. దీనిపై స్పందించిన వైట్‌హైజ్.. ఆ టెలివిజన్ షో తీరును తప్పుబట్టింది. ట్రంప్ ఆదాయం, పన్ను చెల్లింపుల వివరాలను వెల్లడిస్తూనే, టిఆర్‌పి (టెలివిజన్ రేటింగ్ ఫర్ ప్రోగ్రామ్) కోసం కావాలనే ఈ విధంగా చేశారంటూ మండిపడింది. ఇది అనైతికమంటూ ఘాటైన పదజాలంతో కూడిన ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే అమెరికాలోని చాలామంది మధ్యతరగతి ప్రజలు చెల్లిస్తున్న పన్ను రేటు కంటే తక్కువ రేటునే ట్రంప్ చెల్లించారని తెలుస్తోంది. అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలను నిర్వర్తిస్తున్న ట్రంప్ తన కోట్లాది రూపాయల ఆదాయాన్ని మరుగున పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలు, నిర్ణయాలతో అమెరికా పరువును పోగొడుతున్న ట్రంప్‌కు ఈ పన్నుల వివాదం కొత్త తలనొప్పిగా మారుతోంది. కాగా, దశాబ్దాల కాలం నుంచి తన పన్నుల వివరాలను బయటపెట్టని తొలి అమెరికా అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్. అయితే రెగ్యులర్ ఆడిటింగ్ పూర్తయితే పన్నుల వివరాలను చెబుతానని ట్రంప్ అంటున్నారు. కానీ వేలాది మంది అమెరికన్ ప్రజలు మాత్రం తక్షణమే ట్రంప్ తన పూర్తి ట్యాక్స్ రిటర్న్స్ వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదిఏమైనా ఈ వ్యవహారంపై వచ్చిన టీవీ షో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ఐసిఐసిఐ
ఈజీ పే లక్ష్యం

2.4 లక్షల ఖాతాలు

ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 15: బహుళ డిజిటల్ విధానాల ద్వారా మొబైల్ ఫోన్లపై చెల్లింపులకు శ్రీకారం చుట్టిన ఐసిఐసిఐ ఈజీ పే.. 2.4 లక్షల ఖాతాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే లక్ష మంది వ్యాపారులు ఈజీ పేలో నమోదు చేసుకోగా, మిగిలిన లక్ష్యాన్ని చేరుకునేందుకు సంస్థ విస్తృత కసరత్తు చేస్తోంది. ఐసిఐసిఐ బ్యాంకు యుపిఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్ ద్వారా కొనుగోలుదారులు, అమ్మకందారులకు చెల్లింపులను అనుమతిస్తోంది. ఈ విధానం అమలు ప్రారంభించిన ఆరు నెలల కాలంలోనే దాదాపు లక్ష మంది పిఓఎస్ ఖాతాలు తెలిచారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 4 వేల మందికి పైగా వ్యాపారులు ఈజీ పేను నమోదు చేసుకున్నారు. ఖాతాదారులు తమ ఫోన్ ద్వారానే చెల్లింపులు జరుపుకునే వెసులుబాటు ఈజీ పే ద్వారా కలుగుతుంది. బ్యాంకు ఖాతాకు అనుసంధానమైన మొబైల్ ఫోన్ నెంబర్ ద్వారా స్మార్ట్ఫోన్‌పై ఈజీ పే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, టూర్ ఆపరేటర్లు, కెమిస్ట్‌లు, ఇతర వ్యాపారస్తులు ఈ యాప్‌ను సద్వినియోగం చేసుకోవచ్చని బ్యాంకు సిఎండి చందా కొచ్చర్ విశాఖలో పలువురు వ్యాపారులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరించారు.

రుణ క్రమశిక్షణ
దెబ్బతింటోంది
పంట రుణాల మాఫీపై
ఎస్‌బిఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య
ముంబయి, మార్చి 15: పంట రుణాల మాఫీ పథకాలు రుణగ్రహీతల క్రమశిక్షణను దెబ్బతీస్తున్నాయని ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ఈ తరహా రుణ మాఫీ నిర్ణయాలు బ్యాంకుల ఆర్థిక పరిపుష్ఠికి ఇబ్బందికరంగా మారుతున్నాయని అన్నారు. బుధవారం ఇక్కడ పారిశ్రామిక సంఘం సిఐఐ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె మాట్లాడుతూ ఇటీవల ముగిసిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని బిజెపి ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ‘ప్రభుత్వం చెల్లిస్తే ఈ దఫా రుణాలు బ్యాంకులకు అందుతాయి. కానీ ఈ రుణ మాఫీ ప్రకటనల వల్ల మళ్లీ బ్యాంకుల నుంచి రుణాలు పొందే రైతులు.. తీసుకున్న రుణాలను చెల్లించడానికి వచ్చే ఎన్నికల వరకు ఆగుతారు. రుణ మాఫీ అవుతుందేమోనన్న ఆశతో’ అని భట్టాచార్య వ్యాఖ్యానించారు. ఫలితంగా రుణాలను చెల్లించే సామర్థ్యం ఉన్నవారు కూడా చెల్లించకుండా పోతున్నారని, ఇది బ్యాంకులకు శ్రేయస్కరం కాదన్న ఆందోళనను వెలిబుచ్చారు.

మెక్‌నల్లికి ఆంధ్రా సోలార్ ప్రాజెక్టు
న్యూఢిల్లీ, మార్చి 15: మెక్‌నల్లి భారత్ ఇంజినీరింగ్.. ఆంధ్రప్రదేశ్‌లో 415.29 కోట్ల రూపాయల సోలార్ పవర్ ప్రాజెక్టును దక్కించుకుంది. సివిల్ వర్క్స్‌తోపాటు డిజైన్, ఇంజినీరింగ్, తయారీ, సరఫరా, నిర్మాణం, నిర్వహణ, ఉత్పాదకత తదితర పనులను మెక్‌నల్లి భారత్ ఇంజినీరింగ్ ఈ ప్రాజెక్టులో భాగంగా చేపడుతుంది. ఆంధ్రపద్రేశ్ పవర్ జెనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం ఇపిసి ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును అందుకున్నట్లు బుధవారం బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు మెక్‌నల్లి భారత్ ఇంజినీరింగ్ తెలియజేసింది. బిఎస్‌ఇలో సంస్థ షేర్ విలువ 57.05 రూపాయల వద్ద ఉంది.

ఎయిర్‌సెల్-ఆర్‌కామ్ విలీనానికి ఆమోదం
న్యూఢిల్లీ, మార్చి 15: తమ వైర్‌లెస్ కార్యకలాపాలను ఎయిర్‌సెల్‌లో విలీనం చేయడానికి సంబంధించి రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్).. మార్కెట్ రెగ్యులేటర్ సెబీతోపాటు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ (బిఎస్‌ఇ), నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ (ఎన్‌ఎస్‌ఇ)ల నుంచి ఆమోదం పొందింది. ఈ విలీనం ఆమోదం కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) ముంబయి బెంచ్‌కూ దరఖాస్తు పెట్టుకున్నట్లు ఓ ప్రకటనలో బుధవారం రిలయన్స్ కమ్యూనికేషన్స్ తెలియజేసింది. నిరుడు సెప్టెంబర్ 14న ఎయిర్‌సెల్ లిమిటెడ్‌లో తమ వైర్‌లెస్ టెలికామ్ వ్యాపారాన్ని విలీనం చేయనున్నట్లు అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ ప్రకటించినది తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు
2 శాతం డిఎ పెంపు

జనవరి 1 నుంచే వర్తింపు

న్యూఢిల్లీ, మార్చి 15: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం కరవు భత్యం పెంపును బుధవారం కేబినెట్ ఆమోదించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచే ఉద్యోగులకు, పెన్షనర్లకు ఈ పెంపు వర్తిస్తుందని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కెకెఎన్ కుట్టి పిటిఐకి తెలిపారు.
కాగా, ఉద్యోగులు, పెన్షనర్ల ఆదాయంపై ద్రవ్యోల్బణ ప్రభావం దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే ఉద్యోగ, కార్మిక సంఘాలు మాత్రం ఈ పెంపుపై సంతృప్తిగా లేవు. ద్రవ్యోల్బణం వాస్తవ ప్రభావాన్ని తక్కువగా చూపి కరవు భత్యాన్ని పెంచారంటూ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. 2 శాతం పెంపు సరికాదన్న అభిప్రా యాలను వ్యక్తం చేశాయ.

ఫెడ్ రిజర్వ్ భయాలతో..
ౄ 45 పాయింట్లు కోల్పోయిన సెనె్సక్స్
ౄ అమ్మకాల ఒత్తిడిలో మదుపరులు
ముంబయి, మార్చి 15: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. మంగళవారం భారీ లాభాలను అందుకున్న సూచీలు.. వాటిని కొనసాగించడంలో బుధవారం మాత్రం విఫలమయ్యాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 44.52 పాయింట్లు పడిపోయి 29,398.11 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ స్వల్పంగా 2.20 పాయింట్లు కోల్పోయి 9,084.80 వద్ద నిలిచింది. అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్.. వడ్డీరేట్లను పెంచనుందన్న సంకేతాలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఈ క్రమంలోనే ఐటి, టెక్నాలజీ, చమురు, గ్యాస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయంగా చూస్తే ఆసియా మార్కెట్లలో మిశ్రమ స్పందన కనిపించగా, ఐరోపా మార్కెట్లు మాత్రం లాభాల్లో కదలాడాయి.

ఆంధ్రా బ్యాంక్‌కు ప్రతిష్ఠాత్మక అవార్డు
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 15: రూపే కార్డుల జారీలో విస్తృత సేవలందించినందుకుగాను ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఆంధ్రా బ్యాంకుకు ‘నేషనల్ పేమెంట్ ఎక్సెలెన్సీ అవార్డు-2016’ లభించింది. ఎన్‌పిసిఐ ఈ అవార్డును ముంబయిలో ఇటీవల జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో అందించింది. ఆంధ్రా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎకె రథ్ ఈ అవార్డును ఎన్‌పిసిఐ ఎండి, సిఈఓ నుంచి స్వీకరించారు.
జివికె మియాల్‌కు..
ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్వహణ బాధ్యతలు చూస్తున్న జివికె ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (మియాల్).. దేశీయంగా, సెంట్రల్ ఆసియాలో అత్యుత్తమ ఎయిర్‌పోర్ట్ స్ట్ఫా సర్వీస్ అవార్డును సొంతం చేసుకుంది.
ఈ నెల 14న నెదర్లాండ్‌లోని ఆమ్‌స్టర్‌డామ్ వద్ద ఏర్పాటు చేసిన పాసింజర్ టెర్మినల్ ఎక్స్‌పోలో స్కైట్రాక్స్ ఈ అవార్డును అందజేసింది. ప్రతిషాఠత్మకమైన ఈ గుఠ్తింపును అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు రేటింగ్ ఏజెన్సీ నిర్వహించిన వార్షిక అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు ప్రయాణీకుల సంతృప్తి అధ్యయనంలో మియాల్ ద్వారా ప్రయాణించిన ప్రయాణీకులు వ్యక్తం చేసిన సంతృప్తి ఆధారంగా నిర్ణయించినట్లు స్కైట్రాక్స్ వెల్లడించింది.