బిజినెస్

భారత్‌కు పెరిగిన బ్రిటన్ కార్ల ఎగుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 22: బ్రిటన్ నుంచి భారత్‌కు కార్ల ఎగుమతులు గడచిన ఏడేళ్లలో దాదాపు 11 రెట్లు పెరిగాయి. టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల విభాగం జాగ్వార్ లాండో రోవర్ (జెఎల్‌ఆర్) ఈ ఎగుమతుల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు బ్రిటన్ మోటార్ తయారీదారులు, వాణిజ్య సంఘం తెలిపింది. జెఎల్‌ఆర్‌లో డిస్కవరీ స్పోర్ట్, రేంజ్ రోవర్ ఎవాక్యూ, జాగ్వార్ ఎక్స్‌ఎఫ్, ఎక్స్‌ఇ, ఎఫ్-పేస్ మోడల్ కార్లకు ఆదరణ కనిపించింది. మరోవైపు 2015 నుంచి గమనిస్తే భారత్‌లో తయారైన కార్లు కూడా బ్రిటన్‌కు 12.6 శాతం అధికంగా ఎగుమతులు అయ్యాయి.

ఎన్‌టిపిసి మధ్యంతర డివిడెండ్ రూ. 2,152 కోట్లు
న్యూఢిల్లీ, మార్చి 22: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016-17)గాను తమ భాగస్వాములకు 2,152.07 కోట్ల రూపాయల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లిస్తున్నట్లు ప్రభుత్వరంగ విద్యుదుత్పాదక దిగ్గజం ఎన్‌టిపిసి బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి 1,500.95 కోట్ల రూపాయల డివిడెండ్‌ను అందించామని పేర్కొంది. విద్యుత్ శాఖ కార్యదర్శి ప్రదీప్ కుమార్ పుజారి సమక్షంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్‌కు ఎన్‌టిపిసి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గుర్దీప్ సింగ్ ఈ మొత్తాన్ని అందించారని స్పష్టం చేసింది. ఎన్‌టిపిసి లిమిటెడ్.. డివిడెండ్లను చెల్లించడం వరుసగా ఇది 24వసారి అని వివరించింది.