బిజినెస్

క్వాల్‌కామ్, టి-హబ్ వ్యూహాత్మక ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: క్వాల్‌కామ్ కంపెనీ, టి-హబ్‌తో బుధవారం వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే వేగవంతంగా స్టార్టప్స్ ఏర్పాటుకు దోహదపడేలా పనిచేస్తున్న టి-హబ్‌తో తాము చేసుకున్న ఒప్పందం వల్ల భవిష్యత్ ఫలితాలు ఎంతో ఆశాజనకంగా ఉంటాయని క్వాల్‌కామ్ ఇంటర్నేషనల్ ఏషియా పసిఫిక్, ఇండియా ప్రెసిడెంట్ జిమ్ కాథే తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా టి-హబ్ చేపడుతున్న స్టార్టప్స్‌ను వేగవంతం చేసేందుకు వీలుగా డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్ సౌకర్యాల్లో తమ సేవలను అందిస్తామని వెల్లడించారు. ఈ జనవరిలోనే డిజైన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా క్వాల్‌కామ్ 8.5 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైనట్లు స్పష్టం చేశారు. క్వాల్‌కామ్ టెక్నాలజీ లైసెన్సింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జోన్ హన్ మాట్లాడుతూ డిజిటల్ ఇండియా నిర్మాణంలో భాగంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో ఎకో సిస్టమ్ అభివృద్ధి చేసే దిశగా టి-హబ్‌తో ఒప్పందానికి ముందుకొచ్చామని తెలిపారు. తద్వారా స్టార్టప్స్ రూపకల్పనలో తమ భాగస్వామ్యం అందిస్తామని చెప్పారు. టి-హబ్ సిఇఒ జయ క్రిష్ణన్ ఈ ఒప్పందంపై స్పందిస్తూ దేశంలో ఎంతో పోటీ వాతావరణ వ్యాపార పరిస్థితులు నెలకొన్న తరుణంలో ఈ ఒప్పందం స్టార్టప్స్ ఏర్పాటులో కీలకమవుతుందన్నారు. క్వాల్‌కామ్‌తో కలిసి పని చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.