బిజినెస్

అంతర్జాతీయ ప్రమాణాలతో దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 22: యాదాద్రి జిల్లా దండుమల్కాపూర్ టిఐఎఫ్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును అంతర్జాతీయ ప్రమాణాలతో దేశంలోనే రోల్ మోడల్‌గా అభివృద్ధి చేస్తామని టిఎస్‌ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. సుమారు 370 ఎకరాల్లో ఏర్పాటు చేసే ఈ పార్కులో వరల్డ్ క్లాస్ వౌలిక సదుపాయాలను కల్పించి ఏడాదిలోగా ఉత్పత్తులు ప్రారంభించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు చెప్పారు. బుధవారం పరిశ్రమ భవన్‌లో టిఎస్‌ఐఐసి బోర్డు సమావేశ మందిరంలో దండుమల్కాపూర్ టిఐఎఫ్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్కుకు కేటాయించిన భూములకు సంబంధించి మొదటి దశ చెల్లింపుల కింద 10 కోట్ల రూపాయల చెక్కును టిఐఎఫ్ ప్రతినిధులు బాలమల్లుకు అందజేశారు. బాలమల్లు మాట్లాడుతూ దండుమల్కాపూర్ ఇండస్ట్రియల్ పార్క్‌ను దేశంలోనే నెంబర్‌వన్‌గా అభివృద్ధి చేసేందుకు టిఎస్‌ఐఐసి, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా టిఐఎఫ్‌కు సహకారం అందిస్తాయన్నారు. ఇండస్ట్రియల్ పార్కులో అత్యాధునిక వౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిధులను కేటాయించామన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, సిమ్డ్ సిఇఒ మధుసూదన్, టిఐఎఫ్ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు ఆనంద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రఘు తదితరులు పాల్గొన్నారు.
టిఎస్‌ఐఐసికి చెక్కును అందిస్తున్న టిఐఎఫ్