బిజినెస్

3 హెచ్‌ఎంటి యూనిట్ల మూసివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 6: ఒకప్పుడు ఎంతో పాపులర్ అయిన హెచ్‌ఎంటి వాచీలను తయారు చేసే విభాగంతోపాటుగా నష్టాలు వస్తున్న హిందుస్థాన్ మెషిన్ టూల్స్ (హెచ్‌ఎంటి)కి చెందిన మూడు విభాగాలను మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. మూసివేయాలని నిర్ణయించిన మిగతా రెండు యూనిట్లలో హెచ్‌ఎంటి చినార్, హెచ్‌ఎంటి బేరింగ్స్ విభాగాలున్నాయి. 2007 పే స్కేల్స్ ప్రకారం ఉద్యోగులకు ఆకర్షణీయమైన స్వచ్ఛంద పదవీ విరమణ పథకం (విఆర్‌ఎస్)ను అమలు చేయడం ద్వారా ఈ యూనిట్లను మూసివేయాలని కేంద్రం నిర్ణయించింది. ‘రూ. 427.48 కోట్ల నగదు సహాయంతో ఆకర్షణీయమైన విఆర్‌ఎస్/విఎస్‌ఎస్, అలాగే బకాయిలను చెల్లించడం ద్వారా వెయ్యి మంది ఉద్యోగులను వేరు చేసిన తర్వాత నష్టాల్లో నడుస్తున్న హెచ్‌ఎంటి లిమిటెడ్‌కు చెందిన మూడు అనుబంధ సంస్థలు హెచ్‌ఎంటి వాచెస్, హెచ్‌ఎంటి చినార్ వాచెస్, హెచ్‌ఎంటి బేరింగ్స్‌ను మూత దశకు చేరుకుంటాయి’ అని ఒక అధికారిక ప్రకటన తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సిసిఇఏ) సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ మూడు విభాగాల ఉద్యోగులు ఎదుర్కొంటున్న కష్టాలను తీర్చడానికి 2007 వేతన స్కేళ్ల ప్రకారం ఆకర్షణీయమైన విఆర్‌ఎస్/విఎస్‌ఎస్ ప్యాకేజిలు ఇచ్చి, వాటిని మూసివేయడానికి సిసిఇఏ తన ఆమోదం తెలిపిందని ఆ ప్రకటన తెలిపింది. ఆ తర్వాత ఈ మూడు విభాగాలకు చెందిన స్థిర, చర ఆస్తులను ప్రభుత్వ విధానం ప్రకారం విక్రయించడం జరుగుతుందని కూడా ఆ ప్రకటన తెలిపింది. భారీ పరిశ్రమల మంత్రి త్వ శాఖ కింద ఉన్న హెచ్‌ఎంటికి చెందిన మూడు యూనిట్లు, తుంగభద్ర స్టీల్, హిందుస్థాన్ కేబుల్స్‌తో కలిపి మొత్తం అయిదు యూనిట్లను మూసివేయాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఇంతకు ముందు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటికి విడిడిగా విఆర్‌ఎస్ చెల్లింపులు లాంటి ప్రతిపాదనలన్నిటినీ ఆ తర్వాత సిసిఇఏ ఆమోదం కోసం సిద్ధం చేసారు. తుంగభద్ర స్టీల్ మూసివేతకు సంబంధించిన ప్రతిపాదనలకు సిసిఇఏ గత నెల ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ కింద మొత్తం 31 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలుండగా వాటిలో 12 లాభాలు ఆర్జిస్తున్నాయి. మిగతా 19 నష్టాల్లో ఉన్నాయి. అయితే నష్టాలు వస్తున్న యూనిట్లను పునరుద్ధరించడానికి ఉన్న అవకాశాలను అంచనా వేయడం కోసం ప్రభుత్వం ఒక్కో ప్రభుత్వ యూనిట్ నష్టాలను అంచనా వేస్తోంది. ఈ ప్రక్రియలో భాగంగా తిరిగి లాభాల్లో సాగడానికి అవకాశాలున్న సిపిఎస్‌యులను పునరుద్ధరించడంతోపాటుగా పూరి తగా నష్టాల్లో కూరుకుపోయిన వాటిని ఉద్యోగులకు తగిన పరిహారాన్ని చెల్లించిన తర్వాత మూసివేస్తారు.