బిజినెస్

ఎయిర్ కార్గోను బలోపేతం చేస్తాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, మార్చి 25: దేశంలో ఎయిర్ కార్గో సేవలను విస్తృతం చేయనున్నట్టు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడించారు. శనివారం ఇక్కడ తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ ఎయిర్ కార్గోను బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రపంచ ఎయిర్ కార్గో సేవల్లో భారత్ వెనుకంజలో ఉందన్నారు. అందుకే రానున్న కాలంలో ఈ సేవలను విస్తృతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూసేకరణ పూర్తయ్యిందని, త్వరలోనే పనులు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల పెంపునకు రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉందన్నారు. అసెంబ్లీ స్థానాలు పెరగడం మంచిదేనని, దానివల్ల ఎవరికీ నష్టం ఉండదని పేర్కొన్నారు.
శివసేన ఎంపి అనుచిత ప్రవర్తనపై చర్యలు తీసుకోలేదు
ఇటీవల మహారాష్టక్రు చెందిన శివసేన ఎంపి రవీంద్ర గైక్వాడ్ ఎయిరిండియా విమాన సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించడంపట్ల తాము అతనిపై ప్రత్యేకించి చర్యలు ఏమి తీసుకోలేదని అశోక్ గజపతిరాజు తెలిపారు. అయతే ఎయిరిండియాకు బాసటగా మిగిలిన ఎయిర్‌లైన్స్ అన్నీ ఆ ఎంపి ప్రయాణాలను తమ విమానాల్లో నిషేధించాయన్నారు.