బిజినెస్

బజాజ్-కవాసాకి బంధానికి తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 25: భారతీయ ఆటో రంగంలో బజాజ్-కవాసాకి బంధానికి తెరపడుతోంది. దశాబ్దకాలం దోస్తీకి ఈ ఆటో దిగ్గజాలు వచ్చే నెలతో గుడ్‌బై చెబుతున్నాయి. దేశీయంగా అమ్మకాలు, సేవలకు సంబంధించి జపాన్‌కు చెందిన కవాసాకితో బజాజ్ భాగస్వామ్యం ఏప్రిల్ 1 నుంచి రద్దయిపోతోంది. పరస్పర అంగీకారంతో ఇందుకు ఇరు సంస్థలు సమ్మతించాయని శనివారం ఓ ప్రకటనలో బజాజ్ ఆటో అధ్యక్షుడు (ప్రోబైకింగ్) అమిత్ నంది స్పష్టం చేశారు. పుణెకు చెందిన బజాజ్ ఆటో.. ఆస్ట్రియాకు చెందిన కెటిఎమ్ సంస్థతో జట్టు కట్టినది తెలిసిందే. ప్రోబైకింగ్ ఔట్‌లెట్లలోనే కవాసాకి బైకులతోపాటు కెటిఎమ్ బైకులనూ బజాజ్ అమ్ముతోంది. అయితే కెటిఎమ్ వెంచర్ బలోపేతంపై బజాజ్ ఆటో దృష్టి పెట్టాలని నిర్ణయించుకుంది. దీంతోనే కవాసాకి జాయింట్ వెంచర్‌కు వీడ్కోలు చెబుతోంది. మరోవైపు భారత్‌లో ఇకపై కవాసాకి మోటార్‌సైకిళ్ల అమ్మకాలు ఇండియా కవాసాకి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా జరగనున్నాయి. జపాన్‌లోని తమ మాతృ సంస్థ కవాసాకి హెవీ ఇండస్ట్రీస్‌కు చెందిన పూర్తిస్థాయి భారతీయ అనుబంధ సంస్థ ఇది. దేశవ్యాప్తంగా డీలర్‌షిప్ నెట్‌వర్క్‌నూ ఇది విస్తరించుకుంది. నిజానికి ఇది 2010 జూలైలోనే ఏర్పాటైంది. బజాజ్-కవాసాకి కూటమి విమోచనంతో ఇకపై కవాసాకి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ తెరపైకి రానుంది. కాగా, బజాజ్-కవాసాకి వెంచర్‌లో అమ్ముడైన పాత వాహనాలకూ తాము సర్వీస్ చేస్తామని కవాసాకి మెటార్స్ తెలిపింది. ఇదిలావుంటే ప్రస్తుత, భవిష్యత్ వ్యాపారాల కోసం ప్రపంచవ్యాప్తంగా బజాజ్-కవాసాకి సహకార బాంధవ్యం కొనసాగుతుందని అమిత్ నంది అన్నారు. 2009లో తమ ప్రోబైకింగ్ నెట్‌వర్క్ ద్వారా కవాసాకి మోటార్‌సైకిళ్ల అమ్మకాలు, ఆ తర్వాతి సేవలను నిర్వహించడం కోసం కవాసాకితో కలిసి బజాజ్ ఆటో ఓ కూటమిని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడిక కెటిఎమ్ డీలర్‌షిప్‌లకు తమ ప్రోబైకింగ్ నెట్‌వర్క్‌ను అనుసంధానిస్తామని అమిత్ నంది చెప్పారు. 200 డ్యూక్ మోడల్‌తో 2012లో బజాజ్-కెటిఎమ్ భాగస్వామ్యం మొదలైంది. గడచిన ఐదేళ్లలో కెటిఎమ్.. 48 శాతం సిఎజిఆర్‌ను సాధించిందని, ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో కెటిఎమ్ బైక్స్ అమ్మకాలు 37 వేల యూనిట్లుగా ఉంటాయని అంచనా వేస్తున్నట్లు నంది తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా 300లకుపైగా కెటిఎమ్ డీలర్‌షిప్‌లలో ఐదు ఎస్‌కెయుల ద్వారానే ప్రస్తుతం డ్యూక్, ఆర్‌సి మోడల్స్ బైకులు అందుబాటులో ఉన్నాయన్నారు.