బిజినెస్

ఉత్పత్తి, రవాణాలో సింగరేణి సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 29: సింగరేణి తన గత రికార్డులను అధిగమిస్తూ బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఒకేరోజు 2.45 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి, 43 రేక్‌లలో రవాణా చేసినట్లు ఆ సంస్థ సిఎండి ఎన్ శ్రీధర్ తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు, అధికారులను ఆయన అభినందించారు. నిరుడు మార్చి 28 నాటికి 60.38 టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధిస్తే ఈ ఏడాది మార్చి 28 నాటికి 60.59 మిలియన్ టన్నులను సాధించినట్లు తెలిపారు.
16 మిలియన్ల కస్టమర్లు లక్ష్యం: కొటక్ మహీంద్ర
ముంబయ, మార్చి 29: రాబోయే రెండేళ్లలో కస్టమర్లను 16 మిలియన్లకు పెంచుకోవడమే తమ లక్ష్యమని దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో నాలుగో అతిపెద్ద బ్యాంకైన కొటక్ మహీంద్ర బుధవారం తెలిపింది. 2015 ఏప్రిల్‌లో ఐఎన్‌జి వైశ్యా బ్యాంక్‌ను కొటక్ మహీంద్ర విలీనం చేసుకున్నది తెలిసిందే. ఈ నేపథ్యంలో బ్యాంక్‌శాఖల విస్తరణ జరగగా, అందుకు తగ్గట్లుగా ఖాతాదారులనూ పెంచుకోవడంపై ఇప్పుడు కొటక్ మహీంద్ర దృష్టి సారించింది.