బిజినెస్

ఏప్రిల్ 1న బ్యాంకులకు సెలవే: ఆర్‌బిఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మార్చి 29: బ్యాంకులు వరుసగా ఈ వారం రోజులు పని చేయాలన్న ఆదేశంపట్ల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) కొంత మెత్తబడింది. ఈ క్రమంలోనే ఏప్రిల్ 1 (శనివారం)న పనిచేయక్కర్లేదని బుధవారం చెప్పింది. నూతన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచే మొదలవుతుంది కాబట్టి ఆ రోజును వార్షిక వ్యాపార లావాదేవీల ముగింపు దినంగా బ్యాంకులు పాటిస్తాయి. రోజువారి బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వర్తించవు. అయితే పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న క్రమంలో పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది కలగకుండా ఈ వారం మొత్తం ఎలాంటి సెలవులు తీసుకోరాదని బ్యాంకులను ఆర్‌బిఐ ఈ నెల 24న ఆదేశించింది. దీనిలో ఏప్రిల్ 1కి మినహాయింపునిచ్చింది. ఈ మేరకు బ్యాంకులకు, ఉద్యోగ సంఘాలకు ఆర్‌బిఐ స్పష్టం చేసింది.