బిజినెస్

పామోలిన్ రంగంలోకి ట్రైమెక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, ఏప్రిల్ 5: దేశంలో పామోలిన్, ఇతర

పామోలిన్ ఉత్పత్తుల వినియోగానికి ఉన్న

డిమాండ్ దృష్ట్యా దానికి సరిపడా సరఫరా కోసం

మలేషియాకు చెందిన ‘ఫెల్డా గ్లోబల్ వెంచర్స్

హోల్డింగ్ బెర్‌హాద్’ (ఎఫ్‌జివి) కంపెనీతో అవగాహన

ఒప్పందం కుదుర్చుకున్నట్టు ట్రైమెక్స్ ఇండస్ట్రీస్

ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్ కోనేరు

బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం

ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న పామోలిన్‌లో 12

శాతం భారత్ దిగుమతి చేసుకుంటోంది. రాబోయే

రోజుల్లో పామోలిన్‌కు మరింత డిమాండ్ పెరగనుంది.

అంతేగాకుండా దేశంలోని అర్బన్, సెమీ అర్బన్,

రూరల్ ప్రాంతాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని

ఆయన తెలిపారు. దానికి అనుగుణంగా రాబోయే

ఐదేళ్లలో దేశాన్ని పామోలిన్ రంగంలో అగ్రగామిగా

నిలిచేందుకు ప్రణాళికను సిద్ధం చేశామన్నారు.

కాగా, ఎఫ్‌జివి సంస్థ ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద

పామాయిల్ ఎగుమతిదారుగా ఉందని ఆ సంస్థ

సిఇఓ డి జడ్ అర్షద్ తెలిపారు. అలాగే తాము

ప్రపంచంలోని చిన్న, మధ్య తరగతి మార్కెట్లపై దృష్టి

సారించామని పేర్కొన్నారు. తాము ఏడాదికి 6

లక్షల టన్నుల పామాయిల్, అనుబంధ

ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామని తెలిపారు.

భారతదేశం 54 శాతం క్రూడ్ పామోయిల్‌ను

దిగుమతి చేసుకుంటోందని దీని తరువాత స్థానంలో

సోయాబీన్ ఆయిల్ 21 శాతం, సన్ ఫ్లవన్ ఆయిల్ 11

శాతం దిగుమతి చేసుకుంటోందన్నారు. తమ సంస్థ

వ్యాపార విస్తరణలో భాగంగా భారత్‌లోని ట్రైమెక్స్

సంస్థతో అవగాహన ఒప్పందం చేసుకున్నామని

తెలిపారు.