బిజినెస్

స్వల్ప నష్టాల్లో మార్కెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 6: ఆసియా మార్కెట్ల సానుకూల ప్రభావంతో వరసగా గత మూడు సెషన్స్‌లో లాభాల బాటలో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆర్‌బిఐ ద్రవ్య పరపతి విధానం సమీక్ష నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించడమే దీనికి కారణం. కీలక సూచీలయిన సెనె్సక్స్, నిఫ్టీలు తమ రికార్డు స్థాయిలనుంచి కాస్త వెనక్కి తగ్గాయి. బిఎస్‌ఇ సెనె్సక్స్ దాదాపు 47 పాయింట్లు నష్టపోయి 29,927.34 పాయింట్ల వద్ద ముగియగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ కేవలం 3.20 పాయింట్లు నష్టపోయి 9,261.95 పాయింట్ల వద్ద ముగిసింది. ఆర్‌బిఐ ఎలాంటి ఆశ్చర్యకరమైన నిర్ణయాలు ప్రకటించని నేపథ్యంలో మార్కెట్లు దాదాపుగా నిలకడ స్థితికి చేరుకున్నాయని, అయితే ఇక నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఏ) సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకోబోయే చర్యలకోసం ఎదురుచూడవచ్చని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. సెనె్సక్స్‌లోని మొత్తం 30 కంపెనీల షేర్లలో 17 షేర్లు నష్టపోగా, 13 కంపెనీల షేర్లు లాభపడ్డాయి. ప్రధానంగా రియల్టీ రంగానికి చెందిన కంపెనీల షేర్లు మంచి లాభాలు ఆర్జించాయి. బ్యాంకింగ్ రంగానికి చెందిన షేర్లలో ఎస్‌బిఐ, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు నష్టపోగా, హెచ్‌డిఎఫ్‌సి షేరు స్వల్పంగా పెరిగింది. ఆసియా మార్కెట్లలో జపాన్ నిక్కీ, హాంకాంగ్ హాంగ్ సెంగ్ సూచీలు నష్టపోగా, చైనాకు చెందిన షాంఘై ఇండెక్స్ పెరిగింది.ఇక ఐరోపా మార్కెట్లు సైతం ప్రారంభంలో నష్టాల్లో కొనసాగాయి.