బిజినెస్

స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టుకోసం ఏపితో స్నాప్‌డీల్ భాగస్వామ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 6: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్ విలేజ్ ప్రాజెక్టు కోసం చేతి వృత్తుల కళాకారులకు నేరుగా డిజిటల్ మార్కెట్ సదుపాయం కల్పించడం కోసం కాలిఫోర్నియా యూనివర్శిటీ, బర్క్‌లీ యూనివర్శిటీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ గురువారం ప్రకటించింది.ఈ భాగస్వామ్యంలో భాగంగా స్నాప్ డీల్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా స్థానిక చేనేత కశాకారులకు దేశవ్యాప్తంగా కొనుగోలుదారులతో నేరుగా మార్కెట్ సదుపాయాన్ని కల్పిస్తుందని స్నాప్‌డీల్ సంస్థకు చెందిన బిజినెస్ టీమ్ వైస్‌ప్రెసిడెంట్ విశాల్ చద్దా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ భాగస్వామ్యం ద్వారా స్థానిక హస్తకళాకారులకు అభివృద్ధి అవకాశాలను కల్పించడమే కాకుండా దేశీయంగా ఉత్పత్తి అయిన వస్తువులకు కొత్త మార్కెట్ అవకాశాలను కల్పించడం ద్వారా వాటి కీర్తిని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేసేందుకు వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. ఈ కళాకారులు రూపొందించిన ఉత్పత్తులను స్నాప్‌డీల్‌లోని ఒక ప్రత్యేక పేజిలో ఉంచడం జరుగుతుంది. ప్రస్తుతం తాము ఒక విక్రేతగా మేరుపోడు హాండ్‌లూమ్ అసోసియేషన్‌ను చేర్చుకున్నట్లు ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.