బిజినెస్

వేతనాల చెల్లింపులో ఎఫ్‌ఎంసిజి టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఎఫ్‌ఎంసిజి పరిశ్రమ దేశంలో అత్యధిక వేతనాలు చెల్లించే రంగంగా నిలిచింది. ఈ రంగంలో అన్ని స్థాయిలు, విభాగాల్లో సగటు వార్షిక వేతనం 11.3 లక్షల రూపాయలుగా ఉంటోందని ఓ సర్వే వెల్లడించింది. టీవీలు, ఫ్రిజ్‌లు లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలకు చెందిన ఈ రంగంలో సేల్స్, మార్కెటింగ్, ఔప్లై చైన్ మేనేజిమెంట్ విభాగాల్లో అన్ని అర్హతలు కలిగిన సిబ్బంది అవసరం కావడం, అలాగే 10 లక్షలకు పైగా కేటగిరీల్లో మొత్తం ఉద్యోగాల్లో దాదాపు 30 శాతం దాకా ఉద్యోగావకాశాలు ఉండడం ఎఫ్‌ఎంసిజి రంగం అత్యధిక వేతనాలు చెల్లించే రంగంగా నిలవడానికి ప్రధాన కారణంగా ఉంటోంది.
కాగా, ఎఫ్‌ఎంసిజి తర్వాత రెండు, మూడు స్థానాల్లో ఐటి, విద్యుత్ రంగాలు ఉన్నాయి. ఈ రంగాల్లో అన్ని స్థాయిలు, బాధ్యతల ఉద్యోగుల సగటు వేతనం ఏడాదికి రూ. 9.8 లక్షలు, రూ. 9.3 లక్షలుగా ఉందని ‘రాండ్‌స్టాండ్’ 2017 సంవత్సరపువేతనాల ధోరణులపై విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఇక ఫార్మా, వైద్య సేవల రంగంలో సగటు వార్షిక వేతనాలు రూ.8.8 లక్షలుగా ఉండగా, టెలికాం రంగంలో రూ.8.7 లక్షలుగా ఉందని, దేశంలో ఈ అయిదు రంగాలు అత్యంత ఆకర్షణీయమైన రంగాలుగా ఉన్నాయని ఆ నివేదిక వెల్లడించింది. సమర్థులైన వ్యక్తులను ఆకర్షించడానికి, సంస్థల్లో ఉద్యోగులు కొనసాగేలా చూడడానికి సరయిన వేతనాలు అవసరమైన విషయాన్ని ప్రస్తుతం పరిశ్రమల రంగం గుర్తించిందని, అందువల్ల మార్కెట్లో ఇప్పుడున్న వేతనాల ట్రెండ్‌లను నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు అవసరమైన మార్పులు చేసుకోవలసిన అవసరం ఉందని రాండ్‌స్టాడ్ ఇండియా ఎండి, సిఈఓ మూర్తి కె ఉప్పులూరి అభిప్రాయ పడ్డారు.
ఇక ప్రాంతాల వారీగా వేతనాల విషయానికి వస్తే ఐటి రాజధాని బెంగళూరు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ఇక్కడ అన్ని స్థాయిలలో, విభాగాల్లో సగటున చెల్లించే వార్షిక వేతనం రూ. 14.6 లక్షలుగా ఉంటోంది. కాగా, ఆర్థిక రాజధాని ముంబయి రూ. 14.2 లక్షల సగటు వార్షిక వేతనంతో రెండో స్థానంలో ఉండగా, రూ.13.6 లక్షల వేతనంతో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. ఢిల్లీ(ఎన్‌సిఆర్) చెన్నై, పుణె, కోల్‌కతా నగరాలు వరసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అంతేకాదు, మిగతా రంగాలతో పోలిస్తే ప్రస్తుతం మార్కెట్లో మిగతా వారికన్నా ఎక్కువ డిమాండ్ ఉండే ‘హాట్ జాబ్స్’లను కూడా ఈ అధ్యయనం పేర్కొంది. దాదాపు 20 పరిశ్రమల్లో 15 రకాల ముఖ్యమైన కార్యకలాపాల్లో పని చేసే దాదాపు లక్ష మంది ఉద్యోగుల వేతనాలను విశే్లషించి రాండ్‌స్టాడ్ సర్వే ఈ నివేదికను రూపొందించింది.