బిజినెస్

మొబైల్స్, పిసిలపై ఏటేటా పెరుగుతున్న ఖర్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది 600 బిలియన్ డాలర్లకు చేరిక
ఖరీదైన వాటివైపే వినియోగదారుల మొగ్గు
గార్ట్నర్ సంస్థ నివేదిక అంచనా

న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఫోన్లు, పర్సనల్ కంప్యూటర్లు(పిసిలు) లాంటి వాటిపై వినియోగదారులు చేసే ఖర్చు ఏటేటా పెరిగిపోతోంది. ఈ వస్తువులపై వినియోగదారులు చేసే ఖర్చు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు శాతం పెరిగి 600 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ రిసెర్చ్ సంస్థ గార్ట్నర్ గురువారం పేర్కొంది. వినియోగదారులు కొత్త ఉత్పత్తులు అది కూడా ఖరీదు ఎక్కువ ఉండే వాటికి ప్రాధాన్యత ఇవ్వడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని కూడా ఆ సంస్థ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఈ పరికరాలపై చేసే ఖర్చు 2016లో 587.2 బిలియన్ డాలర్లు ఉండగా, 2017లో అది 599.13 బిలియన్ డాలర్లకు, 2019లో 627.16 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని గార్ట్నర్ ఒక నివేదికలో పేర్కొంది.
అయితే 2016తో పోలిస్తే పిసిలు, అల్ట్రా మొబైల్స్, మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, ఎగుమతులు మాత్రం యథాతథంగా అంటే 2.3 బిలియన్లుగానే ఉండవచ్చని ఆ నివేదిక అభిప్రాయ పడింది. కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్ల సగటు అమ్మకం ధరలు ఈ ఏడాది రెండు కారణాల వల్ల 2శాతం దాకా పెరగనున్నాయని గార్ట్నర్ తెలిపింది. వాటిలో మొదటిది వీటిలో ఉపయోగించే పరికరాల ధరలు ఈ ఏడాది కూడా పెరగడం, ఫలితంగా ఈ ఉత్పత్తుల ధరలు పెరగడానికి దారి తీస్తోందని ఆ సంస్థ తెలిపింది. అలాగే కొనుగోలుదారులు తక్కువ ధర ఉండే వాటికన్నా కూడా ఎక్కువ ఖరీదు ఉండే వాటి పట్లే మొగ్గు చూపుతుండడం రెండో కారణమని ఆ నివేదిక పేర్కొంది. వినియోగదారులు, వ్యాపారవేత్తలు తమ జీవన విధానానికి తగినట్లుగా ఉండే నాణ్యమైన ఉత్పత్తులనే కోరుకుంటున్నారని, అందువల్ల వారు ధరల గురించి ఆలోచించడం లేదని గార్ట్నర్ రిసెర్చ్ డైరెక్టర్ రంజిత్ అత్వాల్ అభిప్రాయ పడ్డారు. మొత్తం ఖర్చులో 67 శాతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మొబైల్ ఫోన్స్ విభాగం 2017లో 400 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. 2016తో పోలిస్తే ఇది 4.3 శాతం ఎక్కువ. కాగా, పిసిలు అంటే డెస్క్‌టాప్‌లు, ల్యాప్‌టాప్‌లపై వ్యయం ఈ ఏడాది 163.35 కోట్ల డాలర్లకు పెరగవచ్చని, అలాగే అల్ట్రామొబైల్స్ (ఆధునిక మొబైల్స్)పై వ్యయం 36.28 బిలయన్స్‌కు చేరుకోవచ్చని ఆ సంస్థ అంచనా వేసింది. ఇక ఉత్పత్తి విషయానికి వస్తే ఈ ఏడాది 26.5 కోట్ల పిసిలు, 16.1 కోట్ల అల్ట్రా మొబైల్స్,191 కోట్ల మొబైల్ ఫోన్లు ఉత్పత్తి కావచ్చని భావిస్తున్నారు.

23 వేల కరోలా వాహనాలను
రీకాల్ చేస్తున్న టయోటా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: భారత అనుబంధ వాహన తయారీ సంస్థ అయిన టయోటా కిర్లోస్కర్ మోటార్ సంస్థ దేశంలో భారీ సంఖ్యలో వాహనాలను రీకాల్ చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న వాహనాల రీకాల్‌లో భాగంగా ఆ సంస్థ మన దేశంలో సెడాన్ వాహనాలను రీకాల్ చేస్తోంది. భారత్‌లో 23,157 టయోటా కరోలా ఆల్టిస్ వాహనాలను రీకాల్ చేయనుంది. ఎయిర్‌బ్యాగ్‌లో లోపాల కారణంగా జపాన్‌కు చెందిన టయోటా కంపెనీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2.9 మిలియన్ వాహనాలను రీకాల్ చేస్తోంది. హోండా కంపెనీ కూడా ఇదే కారణంపై తన వాహనాలను రీకాల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కంపెనీ గత జనవరిలో మన దేశంలో దాదాపు 41,600 వాహనాలను రీకాల్ చేసింది.