బిజినెస్

పాత పెద్ద నోట్ల రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: పాత పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, పోస్ట్ఫాసు ఖాతాల్లో భారీగా రద్దయిన నోట్ల డిపాజిట్లు జరిగాయని, అయితే చాలామంది ఖాతాదారుల ఆదాయం, డిపాజిట్ చేసిన మొత్తాలకు పొంతనే లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం లోక్‌సభకు తెలియజేశారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా 18 లక్షల కేసులు నమోదైనట్లు జైట్లీ క్వశ్చన్ అవర్ సందర్భంగా ప్రకటించారు. వీరందరి నుంచి సమాచారం కోరగా, చాలామంది స్పందించినట్లు వెల్లడించిన ఆయన స్పందించని వారికి నోటీసులు జారీ చేస్తున్నామన్నారు. కాగా, బ్యాంకింగ్ రంగ డిజిటలైజేషన్ కొనసాగుతోందని, అయితే టెక్నాలజీని ఉపయోగించుకుని మోసాలు కూడా పెరుగుతున్నాయని జైట్లీ చెప్పారు. ఈ క్రమంలో ఈ దిశగా పటిష్ఠమైన భద్రతా చర్యలను చేపట్టాల్సిందిగా బ్యాంకర్లకు సూచించామన్నారు. నల్లధనం, నకిలీ కరెన్సీల నిర్మూలన కోసం నిరుడు నవంబర్ 8వ తేదీ రాత్రి పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించినది తెలిసిందే. రద్దయిన నోట్ల స్థానంలో కొత్తగా 500, 2,000 రూపాయల నోట్లను తీసుకొస్తున్నామని ప్రకటించిన మోదీ.. రద్దయిన నోట్లను బ్యాంకులు, పోస్ట్ఫాసుల్లో డిపాజిట్ చేసుకుని వాటికి సమాన విలువైన కొత్త నోట్లను పొందవచ్చని కూడా సూచించారు. అయితే ఊహించని రీతిలో పేదవాళ్ల జన్‌ధన్ ఖాతాలతోపాటు అన్ని సేవింగ్స్, కరెంట్ ఖాతాల్లో పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ కావడంతో ఆదాయ పన్ను శాఖ వీటిపై దృష్టి సారించింది. మునుపెన్నడూ లేనివిధంగా అయిన డిపాజిట్ల గురించి సదరు ఖాతాదారుల నుంచి వివరణ కోరుతోంది.
ఆదాయ పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌తోపాటు ఇతర దర్యాప్తు ఏజెన్సీలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో 141.13 కోట్ల రూపాయల విలువైన కొత్త 500, 2,000 రూపాయల నోట్లను స్వాధీనం చేసుకున్నాయని జైట్లీ లోక్‌సభకు తెలిపారు. 110 కోట్ల రూపాయలను ఆదాయ పన్ను (ఐటి) శాఖ సీజ్ చేయగా, 26.21 కోట్ల రూపాయలను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ), 4.54 కోట్ల రూపాయలను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి), 38 లక్షల రూపాయలను రెవిన్యూ ఇంటిలిజెన్స్ శాఖ (డిఆర్‌ఐ) సీజ్ చేశాయని వివరించారు. ఈడి స్వాధీనం చేసుకున్న కొత్త నోట్లను ఎస్‌బిఐ లేదా ఇతరత్రా జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేశారని, అవి మళ్లీ చలామణిలోకి వచ్చాయన్నారు. నల్లధనంపై సోదాల్లో భాగంగా ఈ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు జైట్లీ చెప్పారు.
పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకుల్లో డిపాజిట్ అవ్వని నల్లధనం రూపంలో ఉన్న రద్దయిన 500, 1,000 రూపాయల నోట్లు ఎంత? అనేదానిపై అధికారికంగా స్పష్టమైన అంచనా ఏదీ లేదని లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రుల్లో ఒకరైన సంతోష్ కుమార్ గంగ్వార్ లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. అయితే నిరుడు నవంబర్ 8, డిసెంబర్ 30 మధ్య 5 లక్షల రూపాయలకుపైగా నగదు డిపాజిట్ అయిన ఖాతాలు 23.87 లక్షలుగా ఉన్నాయన్నారు.
పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో అప్పుడు కొన్నిచోట్ల తప్ప ఎక్కడా నగదు, నాణేల కొరత లేదని లోక్‌సభకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రుల్లో ఒకరైన అర్జున్ రామ్ మేఘ్వాల్ లిఖితపూర్వక సమాధానంగా చెప్పారు. బ్లాక్‌మార్కెటీర్ల నుంచి 1, 5, 10 నాణేలు, నోట్లను, 20, 50 రూపాయల నోట్లను కమీషన్ చెల్లించి ప్రజలు పొందుతున్నారన్న వార్తలపై పైవిధంగా మంత్రి బదులిచ్చారు. నిరుడు నవంబర్ 10 నుంచి డిసెంబర్ 19 మధ్య 22.6 బిలియన్ రూపాయల విలువైన వివిధ రకాల నోట్లను ద్రవ్య వ్యవస్థలోకి ప్రవేశపెట్టామని, ఇందులో 20.4 బిలియన్ రూపాయల విలువైనవి 10, 20, 50, 100 రూపాయల నోట్లేనని వివరించారు. పెద్ద మొత్తంలో 5, 10 రూపాయల నాణేలనూ విడుదల చేశామన్నారు. నిజానికి మార్కెట్‌లో కరెన్సీ, నాణేల కొరత ఏదైనా ఎదురైతే తగువిధంగా వాటి ముద్రణ వెనువెంటనే జరుగుతుందని మంత్రి ఈ సంద ర్భంగా స్పష్టం చేశారు.
పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన 2016-17 వార్షిక నివేదికలో పేర్కొంది. గతంలో 1946, 1978లలో రెండుసార్లు నోట్ల రద్దు జరిగిందని, అయతే అప్పుడు ఏమంత కష్టం ఎదురవ్వలేదంది. ఆర్‌బిఐ చట్టం 1934లోని సెక్షన్ 26 క్రింద ప్రస్తుత నోట్ల రద్దు జరిగిందని చెప్పింది.