బిజినెస్

సిమెంట్ ధరలను నియంత్రించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఏప్రిల్ 12: సిమెంట్ ధరల పెరుగుదల నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. గత రెండు నెలల కాల వ్యవధిలో 50 శాతం మేర సిమెంట్ ధరలను పెంచుతూ ప్రధాన సిమెంట్ కంపెనీలు తీసుకున్న నిర్ణయం.. ఇప్పుడు నిర్మాణ రంగాన్ని కుదిపేస్తోంది. దీంతో క్రెడాయ్ సహా పలు నిర్మాణ రంగ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ముఖ్యంగా గ్రామీణ, పట్టణ గృహ నిర్మాణ రంగం సిమెంట్ ధరల పెరుగుదలతో కకావికలు కానుంది. గృహ నిర్మాణ రంగంలో 67 శాతం, వౌలిక సదుపాయాల రంగంలో 13 శాతం, వాణిజ్య రంగంలో 11 శాతం, పారిశ్రామిక రంగంలో 9 శాతం సిమెంట్ వినియోగం జరుగుతోంది. నిరుడు డిసెంబర్ నెలాఖరు నాటికి 230 రూపాయలుగా ఉన్న సిమెంట్ బస్తా ధర ప్రస్తుతం 340 రూపాయల నుంచి 360 రూపాయలుగా ఉంది. మూడు నెలల కాల వ్యవధిలో సుమారు 50 శాతం సిమెంట్ ధరలు పెరిగిపోయాయి. ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టణ, గ్రామీణ గృహ నిర్మాణాన్ని విస్తృతంగా ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో సిమెంట్ ధరల పెరుగుదల దీనిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.
దీనిపై క్రెడాయ్ విశాఖ చాప్టర్ ఆధ్వర్యంలో విశాఖలో బుధవారం సమావేశమైన ప్రతినిధులు సిమెంట్ ధరల పెరుగుదల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం స్పందించకుంటే పనులు నిలిపివేయడం తప్ప గత్యంతరం లేదంటూ అల్టిమేటం ఇచ్చారు. ఈ సందర్భంగా క్రెడాయ్ పూర్వ అధ్యక్షుడు కోటేశ్వర రావు బుధవారం విలేఖరులతో మాట్లాడుతూ ప్రతి ఏటా జనవరి అనంతరం సిమెంట్ కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలు పెంచడం పరిపాటిగా మారిందని ఆరోపించారు. కొన్ని సిమెంట్ కంపెనీలు దీనిలో భాగస్వామ్యం కావడం, మార్కెట్‌ను శాసించడంతో వేల కోట్ల రూపాయలు లూటీ జరుగుతోందన్నారు. రెండు ప్రధాన కంపెనీలు సిమెంట్ ఉత్పత్తిలో 50 శాతం వాటా కలిగి ఉన్నాయని, ఇవే మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయన్నారు. సీజన్‌లో సిమెంట్ ఉత్పత్తిని నిలిపివేసి, కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని, తద్వారా డిమాండ్, సప్లై మేరకు ధరలు పెంచుతున్నారని మండిపడ్డా రు. గతంలో 2009 నుంచి 2011 వరకూ రెండు సంవత్సరాల కాలంలో ఇదే విధంగా సిమెంట్ కంపెనీలు ధరలు పెంచేశాయని, దీనిపై నిర్మాణ సంస్థలు ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. దీనిపై కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) సమగ్ర దర్యాప్తు జరిపిందన్నారు.
దేశంలో 10 సిమెంట్ కంపెనీలకు సిసిఐ నోటీసులు జారీ చేసిందని, రెండళ్ల కాల వ్యవధిలో ఆయా కంపెనీలు చూపిన టర్నోవర్ ఆధారంగా దాదాపు 6,300 కోట్ల రూపాయల మేర అపరాధ రుసుము వసూలు చేసిందన్నారు. వీటిలో నాలుగు కంపెనీలు చెల్లించిన అపరాధ రుసుము 5 వేల కోట్ల రూపా యలన్నారు. తాజాగా కేంద్ర ప్రభు త్వం 2019 చివరి నాటికి కోటి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందని, దీనికోసం 22వేల కోట్ల రూపాయలను బ్యాం కుల నుంచి రుణాలుగా ఇప్పించేలా పిఎంఎవై పథకం రూపకల్పన చేశారన్నారు.
ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే గృహ నిర్మాణానికి సంబంధించి సిమెంట్ ధరలు నియంత్రించని పక్షంలో ఇబ్బందులు ఎదురుకాక తప్పదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో మాదిరి సిమెంట్ ధరల విషయంలో కంపెనీలపై ఒత్తిడి తీసుకువచ్చి అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. లేనిపక్షంలో ఈ నెల 15న క్రెడాయ్ ఆధ్వర్యంలో సమావేశమై కీలక నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు.