బిజినెస్

హైదరాబాద్‌లో ఐఫెక్స్ ఐదో ఎడిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: భారతీయ ఔషధరంగ ఎగుమతుల ప్రోత్సాహక మండలి నిర్వహిస్తున్న మెగా ఫార్మా షో.. ఐఫెక్స్ ఐదో ఎడిషన్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు మూడు రోజులపాటు ఈ ఐఫెక్స్ 2017 ఫార్మా షో హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో జరగనుంది. ‘ఐఫెక్స్‌ను హైదరాబాద్‌కు తీసుకురావడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాం.’ అని ఫార్మెక్సిల్ చైర్మన్ మదన్ మోహన్ రెడ్డి అన్నారు. భారతీయ ఔషధ, హెల్త్‌కేర్ రంగాలకు అంతర్జాతీయ వ్యాపార అవకాశాలను ఐఫెక్స్ అందిస్తుందని చెప్పారు. ఈ మెగా షోలో 100కుపైగా దేశాల కొనుగోలుదారులు పాల్గొంటారన్న ఆయన వారికి తాము ఎపిఐలు, ఫార్ములేషన్స్, న్యూట్రాస్యూటికల్స్, ఎక్సిసిపియంట్స్, వెటర్నరీ డ్రగ్స్, బయోలాజికల్, ఆయుష్ ఉత్పత్తులను చూపించనున్నట్లు తెలిపారు. 600 మందికిపైగా అంతర్జాతీయ కొనుగోలుదారులు 300కుపైగా భారతీయ సంస్థలను ఈ ఐఫెక్స్ 2017 ద్వారా కలుసుకుంటారని పేర్కొన్నారు. వాల్యూమ్స్ పరంగా భారతీయ ఫార్మాస్యూటికల్స్ మార్కెట్ అంతర్జాతీయంగా మూడో స్థానంలో ఉందని, విలువ ఆధారంగా 11వ స్థానంలో ఉందన్నారు. రాబోయే కాలంలో రెండంకెల వృద్ధిని నమోదు చేయడమేగాక 2020 నాటికి 20 మిలియన్ల ఎగుమతులు చేరుకోవాలన్నది తమ లక్ష్యమని చెప్పారు.

మార్కెట్‌లోకి
రూ ఆఫ్జా ఫ్యూజన్
హైదరాబాద్, ఏప్రిల్ 12: హమ్‌దర్ద్ లేబొరేటరీస్ ఇండియా.. మార్కెట్‌లోకి రూ ఆఫ్జా ఫ్యూజన్‌ను విడుదల చేసింది. రూ ఆఫ్జా, స్వచ్ఛమైన పండ్ల రసాల కలయికే ఈ రూ ఆఫ్జా ఫ్యూజన్ పానియమని ఈ సందర్భంగా సంస్థ బుధవారం తెలియజేసింది. 10 వనమూలికల చల్లదనం శక్తిని ఈ ఫ్యూజన్ ఫార్ములేషన్ కలిగి ఉంటుందని చెప్పింది. వినియోగదారులకు వినూత్నమైన రుచిని, అంతకుమించిన ఆరోగ్యాన్ని అందించాలన్నదే తమ లక్ష్యమని సంస్థ స్పష్టం చేసింది. రిఫ్రెషింగ్ లెమన్, డెలీషియస్ ఆరెంజ్, జ్యూసీ మ్యాంగో, ఎక్సైటింగ్ పైనాపిల్, ఆరెంజ్-లూసియస్ అనే ఐదు రుచుల్లో రూ ఆఫ్జా ఫ్యూజన్ లభిస్తుందని హమ్‌దర్ద్ చీఫ్ సేల్స్, మార్కెటింగ్ అధికారి మన్సూర్ అలీ తెలియజేశారు. గత కొనే్నళ్లుగా రెడీ-టు-డ్రింక్ పండ్ల రసాల ఆధారిత పానియాలకు మార్కెట్‌లో డిమాండ్ పెరుగుతోందన్న ఆయన ఈ క్రమంలోనే తాము ఈ రూ ఆఫ్జా ఫ్యూజన్‌తో ఈ విభాగంలోకి ప్రవేశించామని చెప్పారు.