బిజినెస్

పడకేసిన పారిశ్రామిక ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపి) ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో నాలుగు నెలల కనిష్టానికి పతనమైంది. 1.2 శాతానికే పరిమితమైంది. నిరుడు అక్టోబర్‌లో 1.87 శాతంగా నమోదవగా, మళ్లీ ఆ తర్వాత ఇప్పుడే ఆ స్థాయి దరిదాపుల్లో గణాంకాలున్నాయి. నవంబర్‌లో ఇది 5.59 శాతానికి పెరగడం విశేషం. అయితే కీలకమైన ఉత్పాదక రంగం పనితీరు పడిపోవడమే ఫిబ్రవరి ఐఐపి పతనానికి ప్రధాన కారణం. ఐఐపిలో తయారీ రంగం వాటా 75 శాతానికి పైమాటే. అలాంటిది ఫిబ్రవరిలో ఇది 2 శాతానికి దిగజారింది. నిరుడు ఫిబ్రవరిలో 0.6 శాతం వృద్ధిరేటును సాధించింది. క్యాపిటల్ గూడ్స్, కన్జ్యూమర్ గూడ్స్ రంగాల వృద్ధిరేటు కూడా పడిపోయింది. కాగా, నిరుడు ఫిబ్రవరిలో ఇది 1.99 శాతంగా ఉంది. ఇకపోతే గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో ఫిబ్రవరితో ముగిసిన 11 నెలల కాలంలో ఐఐపి వృద్ధిరేటు 0.4 శాతంగా ఉంది. 2015-16 ఏప్రిల్-్ఫబ్రవరిలో ఇది 2.6 శాతంగా ఉంది. ఇకపోతే జనవరికి సంబంధించి ఐఐపి వృద్ధిరేటు గణాంకాలను కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఒ) సవరించింది. 2.74 శాతం నుంచి 3.27 శాతానికి సవరించింది.

5 నెలల గరిష్ఠానికి రిటైల్ ద్రవ్యోల్బణం

న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: రిటైల్ ద్రవ్యోల్బణం గత నెల మార్చిలో 5 నెలల గరిష్ఠాన్ని తాకింది. పోషకాహార పదార్థాలు, వంటనూనెలతోపాటు ఇంధన, విద్యుత్ తదితర ఆహారేతర ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఈ క్రమంలోనే వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత చిల్లర ద్రవ్యోల్బణం 3.81 శాతానికి ఎగబాకింది.
అంతకుముందు నెల ఫిబ్రవరిలో ఇది 3.65 శాతంగా ఉంది. పాలు, గుడ్ల ధరలు 4.69 శాతం, 3.21 శాతం మేర పెరగగా, మీల్స్, స్నాక్స్, స్వీట్స్ తదితర ఉత్పత్తుల ధరలు కూడా 5.65 శాతం వరకు పెరిగాయి. అయితే కూరగాయల ధరలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. మైనస్ 7.24 శాతంగా నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ తెలియజేసింది.