బిజినెస్

భవన నిర్మాణ రంగం కుదేలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/విశాఖపట్నం, ఏప్రిల్ 15: నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిధిలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న నిర్మాణ రంగానికి ఒక్కసారిగా బ్రేకు లు పడ్డాయి. సిమెంట్ ధరల పెంపు, ఇసుక క్వారీల మూత ఈ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఇసుక క్వారీల్లో ప్రొక్లెయినర్లు వంటి మిషనరీని వినియోగిస్తున్నారనే ఫిర్యాదులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన ఆంక్షల వల్ల గుంటూరు జిల్లాలో కృష్ణానది కరకట్ట వెంబడి పెనుమాక, వెంకటపాలెం, రాయపూడి గ్రామాల్లో దాదాపు రెండు మాసాలుగా ఇసుక క్వారీలు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో కృష్ణా జిల్లా గుంటుపల్లి, సూరాయపాలెం నుంచి వారధి మీదుగా ఇసుకను భారీ వ్యయప్రయాసలతో తెప్పించుకోవాల్సి వస్తోంది. దీంతో గతంలో లారీ ఇసుక ధర 2 వేల రూపాయలుగా ఉంటే ప్రస్తుతం 4 వేల రూపా యలకు చేరింది. ఫలితంగా రాష్టవ్య్రాప్తంగా ముఖ్యంగా అమరావతి ప్రాంతంలో భవన నిర్మాణ రంగం కుంటుపడింది. సచివాలయం, అసెంబ్లీ, డైరెక్టరేట్, కమిషనరేట్‌లకు హైదరాబాద్ నుంచి దాదాపు 16 వేల మందికిపైగా అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఇప్పటికే తరలివచ్చారు. ఒక్కసారిగా అమరావతి ప్రాంతానికి తాకిడి పెరగటంతో అందరికీ గూడు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో దాదాపు 20 గ్రామాల్లో ఇటీవలి కాలంలోనే భవన నిర్మాణ రంగం ఊపందుకుంది. రాతి పెంకుటిళ్లు, పూరిళ్లు కూల్చివేశారు. వాటి స్థానంలో రెండు, మూడంతస్తుల్లో భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నెలకు 15 వేల రూపాయ లు అద్దె చెల్లించినా డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ దొరకని పరిస్థితి నెలకొందంటే అతిశయోక్తి కాదు. దీంతో అనేకమంది అటు గుంటూరు, లేదా ఇటు విజయవాడ నుంచి వచ్చిపోతున్నారు. లేదా ఐదారుగురు కలిసి ఒకే ఇంటిలో అద్దెకు ఉంటున్నారు.
ఇదిలావుంటే తాపీ పనివారు, రాడ్‌బెండింగ్ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు.. ఇలా వేలాదిమంది పనులు లేక పస్తులుండే దుస్థితి వచ్చింది. మరోవైపు ఏడాది పొడవునా పంటలు పండే దాదాపు 33 వేల ఎకరాల పంట భూములు బీళ్లుగా మారాయి. దీంతో వ్యవసాయ పనులు కూడా లేకుండాపోయాయి. సిమెంటు కంపెనీలన్నీ సిండికేట్‌గా మారి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారన్న ఆరోపణల మధ్య నెల క్రితం నాటి సిమెంట్ ధరలకు ఇప్పటి ధరలకు మధ్య వ్యత్యాసం విపరీతంగా పెరిగింది. రెండు కేటగిరీల సిమెంట్ ధరల్లో అనూహ్యంగా పెరుగుదల చోటుచేసుకుంది. 215 రూపాయలకు విక్రయించే సిమెంట్ ధరను ఏకంగా 350 రూపాయలకు, 250 రూపాయలది, 385 రూపాయలకు పెంచేశారు. నిన్నటివరకు లారీల సమ్మెను సాకుగా చూపి ఐరన్ టన్ను ధరను 10 వేల రూపాయలకు పెంచారు. ఇలా భారాలపై భారాలతో సామాన్యుడి సొంతింటి కల కూడా ప్రమాదంలో పడింది. రాష్టవ్య్రాప్తంగా ప్రతి ఏటా 60 లక్షల టన్నులకుపైగా సిమెంట్ వినియోగానికి డిమాండ్ ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కూడా సిమెంట్ కంపెనీలు సిండికేట్‌గా మారి ఉత్పత్తి తగ్గించి కృత్రిమ కొరతను సృష్టిస్తూ రేట్లు పెంచేస్తున్నాయంటూ బిల్డర్స్ ధ్వజమెత్తుతున్నారు.
ధరల విషయంలో
ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి: క్రెడాయ్
రెండు నెలలుగా ఆకాశమే హద్దుగా పెరిగిన సిమెంట్ ధరలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలంటూ నవ్యాంధ్ర వ్యాప్తంగా క్రెడాయ్ చాప్టర్లు ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాయి. రాష్ట్రంలో అన్ని క్రెడాయ్ చాప్టర్లు ఈ మేరకు తీర్మానాలు చేసి ప్రభుత్వానికి నివేదించారు. కొన్ని సిమెంట్ కంపెనీలు సిండికేట్‌గా మారి ధరలను విపరీతంగా పెంచుతూ దోపిడీకి పాల్పడుతున్నాయంటూ నిర్మాణ సంస్థలు కొద్ది రోజులుగా ఆరోపిస్తున్నది తెలిసిందే. ఇదేమీ పట్టించుకోని ప్రభుత్వం వౌనం వహించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో నిర్మాణ సంస్థలు ఒకే తాటిపైకి వచ్చి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధపడుతున్నాయ. రాష్ట్రంలో 67 శాతం సిమెంట్‌ను గృహ నిర్మాణ రంగంలోనే వినియోగిస్తున్న దృష్ట్యా ధరల పెరుగుదల ఈ రంగాన్ని కుదేలు చేస్తోందంటూ ప్రభుత్వానికి క్రెడాయ్ మొర పెట్టుకుంది. తక్షణమే ధరలను నియంత్రించాలని, లేనిపక్షంలో వచ్చే వారం నుంచి పనులు నిలిపి వేస్తామంటూ రియల్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇదే జరిగితే గృహ నిర్మాణ రంగంలో పనిచేస్తున్న లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులు పూర్తిగా రోడ్డున పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. నిర్మాణ రంగం స్తబ్ధతదాల్చితే లక్షలాది కార్మికుల జీవన విధానంపై ప్రభావం చూపే అంశంలో తక్షణ చర్యలు అవసరమని సూచిస్తున్నారు. దీనిపై క్రెడాయ్ విశాఖ చాప్టర్ అధ్యక్షుడు కోటేశ్వరరావు ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ నవ్యాంధ్ర రాజధాని అమరావతి పరిసర ప్రాంతాలతోపాటు విశాఖ, ఇతర పట్టణాల్లో గృహ నిర్మాణం జోరుగా సాగుతోందని, ఈ తరుణంలో సిమెంట్ ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల బిల్డర్లపై విపరీతమైన ఆర్థిక భారం పడుతోందన్నారు. ధరలు హఠాత్తుగా పెరగడం వల్ల నిర్మాణ రంగంలో మాంద్యం చోటుచేసుకుంటుందని, ఇది ఆర్థిక రంగంపై కూడా ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాణ రంగాన్ని నమ్ముకుని బతుకుతున్న వారి ఆర్థిక స్థితి గతితప్పే ప్రమాదం ఉందన్నారు. గతంలో సిమెంట్ కంపెనీలు ఇదే విధంగా ధరలు పెంచినప్పుడు ప్రభుత్వం స్పందించిందని గుర్తుచేశారు. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో ప్రభుత్వం కొన్ని సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో చర్చించి, ప్రభుత్వపరమైన నిర్మాణాలకు మాత్రం ధరల పెంపు అమలు చేయమన్న భరోసా తీసుకుందన్నారు. కానీ సామాన్యుల సొంతింటి కల తీర్చే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం లేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగినవిధంగా స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.