బిజినెస్

పసుపు రైతు డీలా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాపాడు, ఏప్రిల్ 15: పచ్చ బంగారంగా పిలువబడే పసుపు పంటకు కాలం కలిసి రావడం లేదు. గత ఆరేళ్లుగా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు కనబడడం లేదు. అయినా ప్రభుత్వ వర్గాల్లో ఏమాత్రం స్పందన లేదని పసుపు రైతులు ఆందోళన చెందుతున్నారు. నిలకడ లేని ధరలతో రైతులు బేజారవుతున్నారు. ఫలితంగా పంట వచ్చింది వచ్చినట్లుగానే విక్రయిస్తున్నారు. కడప జిల్లాలో ప్రధానంగా చాపాడు, దువ్వూరు, మైదుకూరు, రాజుపాళెం, ప్రొద్దుటూరు, ఖాజీపేట, చెన్నూరు, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట తదితర ప్రాంతాల్లో విస్తారంగా పసుపు పంటను రైతులు సాగు చేశారు. జిల్లాలో వరికి ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటగా ప్రతి రైతు పసుపు సాగు చేస్తున్నాడు. ఈ ఏడాది సుమారు 25 వేల ఎకరాల్లో పసుపుపంట సాగైనట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. గత నెల రోజులుగా పంట నూర్పిళ్లు ఆరంభమయ్యాయి. ఎకరాకు 20 నుంచి 40 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. అయితే క్వింటాలు పసుపు ధర 4,500 రూపాయలకు పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ధర తగ్గే అవకాశాలున్నాయన్న భయంతో రైతులు అయినకాడికి అమ్ముకుంటున్నారు. ప్రధానంగా కడప మార్కెట్‌లో వ్యాపారులు, దళారులు కలిసి పసుపు రైతును దోచుకుంటున్నారు. 2010-11 ఆర్థిక సంవత్సరంలో పసుపు పంటకు మంచి గిట్టుబాటు ధర లభించడంతో రైతులు మరింత ఎక్కువ సాగు చేస్తూ వచ్చారు. అప్పట్లో క్వింటాలు పసుపు ధర 12,000 రూపాయల నుంచి 18,000 రూపాయల వరకు పలికింది. క్రమేణా తగ్గుతూ నేడు 4,500 రూపాయలకు పడిపోయింది. అయనా ఇప్పటికీ ధరలు నిలకడగా ఉండే పరిస్థితులు లేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గిట్టుబాటు ధర లేకపోవడంతో చేసేదేమీ లేక రైతులు నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. అంతేగాక అందుబాటులో శీతల గిడ్డంగులు లేకపోవడంతో కర్నూలు, గుంటూరు, విజయవాడకు తరలించి నిల్వ చేసుకోలేక రైతులు వచ్చిన పంటను వచ్చినట్లే అయినకాడికి విక్రయించి నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు గిడ్డంగి సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు చొరవ చూపడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిం చి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.