బిజినెస్

వీరికి ‘మినిమం’తో పనిలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ).. ఖాతాల్లో నెలసరి కనీస నగదు (మినిమం బ్యాలెన్స్) నియమంపై మెత్తబడింది. కొన్నిరకాల ఖాతాదారులకు మినహాయింపునిచ్చింది. స్మాల్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లు, జన్‌ధన్ ఖాతాలు లేదా ప్రధాన్ మంత్రి జన్-్ధన్ యోజన (పిఎమ్‌జెడివై) క్రింద నమోదైన ఖాతాలకు కనీస నగదు అక్కర్లేదని తెలియజేసింది. ఈ మేరకు ఎస్‌బిఐ ట్విట్టర్‌లో స్పష్టం చేసింది. ఇటీవలే భారతీయ మహిళా బ్యాంక్‌తోపాటు తమ ఐదు అనుబంధ బ్యాంకులను విలీనం చేసుకుని కొత్త రూపాన్ని సంతరించుకున్న ఎస్‌బిఐ.. ఈ నెల 1 నుంచి ఖాతాల్లో కనీస నిల్వలుండాలనే నిబంధనను తెచ్చినది తెలిసిందే. నగరాలు, పట్టణాలు, గ్రామాలవారీగా ఖాతాల్లో ఎంత ఉండాలో? చెప్పిన ఎస్‌బిఐ.. ఆ మేరకు ఉండకపోతే జరిమానాల రూపంలో చార్జీలు వసూలు చేస్తామని కూడా చెప్పింది. దేశవ్యాప్తంగా ఆరు మెట్రో నగరాల్లోని ఖాతాదారులు తమ ఖాతాల్లో కనీసం 5 వేల రూపాయలు తగ్గకుండా చూసుకోవాలని లేనిపక్షంలో 100 రూపాయల జరిమానా వేస్తామంది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఈ జరిమానా 20 రూపాయలుగా ఉండగా, కనీస నగదు వెయ్యి రూపాయలుగా ఉంది. దీంతో 31 కోట్ల మంది ఎస్‌బిఐ ఖాతాదారులపై ఈ ప్రభావం పడగా, వీరిలో విద్యార్థులు, పెన్షనీర్లు కూడా ఉన్నారు. సామాన్యుల బ్యాంకుగా ఉన్న ఎస్‌బిఐపై ఈ నిర్ణయం విమర్శలకు దారి తీస్తున్న నేపథ్యంలో బ్యాంక్ తాజా ప్రకటన కోట్లాది మంది ఖాతాదారులకు ఊరటనిస్తోంది.
సేద్యం యంత్రాల సరఫరాకు
నోడల్ ఏజన్సీగా ‘ఆగ్రోస్’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 15: సేద్యం యంత్రాల సరఫరాకు రాష్ట్ర స్థాయిలో నోడల్ సంస్థగా తెలంగాణ రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ లిమిటెడ్’ (ఆగ్రోస్)ను ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని శనివారం జారీ చేసిన ఉత్తర్వులో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సి పార్థసారథి తెలిపారు. సేద్యం యంత్రాలతోపాటు వాహనాలకు వాడే టైర్లు, ట్యూబులు, బ్యాటరీలు, ఫర్నీచర్, ఎయిర్ కండిషనర్లు, జనరేటర్లు, కంప్యూటర్లు తదితర యంత్రాలను కూడా ఆగ్రోస్ ద్వారా కొనుగోలు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలోని వివిధ శాఖల కమిషనర్లు, డైరెక్టర్లు, కార్పోరేషన్లు, సంస్థల ఉన్నతాధికారులు, జిల్లా స్థాయి అధికారులు ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) నుండి అన్ని రకాల కొనుగోళ్లకు ఆగ్రోస్ నోడల్ ఏజన్సీగా ఉంటుందని ఈ సందర్భంగా పార్థసారథి ప్రకటించారు.

జిఎస్‌టిపై ప్రచారానికి సిబిఇసి నిధులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలును కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో జిఎస్‌టిపై అవగాహన కోసం కార్యక్రమాల నిర్వహణకుగాను జోన్లవారీగా నిధులను మంజూరు చేశారు. దేశవ్యాప్తంగా 23 జోన్లకు కోటి రూపాయల చొప్పున నిధులను మంజూరు చేసినట్లు కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ బోర్డు (సిబిఇసి) చీఫ్ వనజ ఎన్ సర్న తెలియజేశారు. ఈ నూతన పన్నుల విధానం గురించి స్థానికంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆయా జోన్ల చీఫ్ కమిషనర్లకు సూచించామని ఆమె తన వీక్లీ న్యూస్‌లెటర్‌లో పేర్కొన్నారు. జూలై 1 నుంచి జిఎస్‌టి అమలుకు సన్నాహాలు జరుగుతున్నాయ.

ఎయిరిండియా సరికొత్త ఆఫర్
ముంబయి, ఏప్రిల్ 15: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిరిండియా.. అమెరికాలో పర్యటనకుగాను ప్రయాణికుల కోసం శనివారం ఓ డిస్కౌంట్ స్టార్ అవార్డ్ మైలేజ్ రిడెంప్షన్ ఆఫర్‌ను ప్రకటించింది. అయితే గురువారం నుంచే ఈ ఆఫర్ మొదలైందని, ఈ నెల 18 వరకు వర్తిస్తుందని చెప్పింది. ఈ ఆఫర్‌లో భాగంగా రాబోయే 330 రోజుల్లో ఎప్పుడైనాసరే ప్రయాణికులు పర్యటించవచ్చని ఓ ప్రకటనలో ఎయిరిండియా తెలియజేసింది. ఈ ఆఫర్ వల్ల ప్రయాణికులకు చెప్పుకోదగ్గ ప్రయోజనాలున్నాయని వెల్లడించింది.