బిజినెస్

తెలంగాణ ఖజానాపై సబ్సిడీల భారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పటికే ఉచిత విద్యుత్, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆహార రాయతీలు
ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్‌రూం, గొర్రెల కొనుగోలు, ఆధునిక సెలూన్లకూ సబ్సిడీలే
తాజాగా ప్రకటించిన ఉచిత ఎరువుల బరువు రూ. 6 వేల కోట్లు
ఏటేటా పెరుగుతూపోతున్న సామాజిక సేవల వ్యయం

హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణ రాష్ట్ర ఖజానాపై సబ్సిడీల భారం పెరుగుతోంది. ఇంతవరకు ఉచిత విద్యుత్, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఆహార సబ్సిడీ, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్‌రూం, గొర్రెల కొనుగోలు, ఆధునిక సెలూన్లకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. తాజాగా బడ్జెట్‌లో గర్భవతులైన మహిళలకు కెసిఆర్ కిట్స్, నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. ప్రస్తుతం ఉచిత ఎరువును రైతులకు పంపిణీ చేయనున్నట్లు కెసిఆర్ సంచలనమైన నిర్ణయం తీసుకున్నారు.
ఉచిత ఎరువులకు సాలీనా సబ్సిడీ కింద 6 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుందని ఆర్థిక శాఖ అంచనా వేసింది. దాదాపు 55 లక్షల మంది రైతులకు లాభం చేకూర్చే ఈ పథకం వల్ల రైతుల ఆత్మహత్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నది ప్రభుత్వ బలమైన వాదన. 2014-15 ఆర్థిక సర్వేలో దేశంలో 5,650 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మొత్తం దేశంలోని ఆత్మహత్యల్లో రైతుల ఆత్మహత్యలు 4.5 శాతంగా ఉన్నాయ. 2014లో మహారాష్టల్రో 2,568 మంది, తెలంగాణలో 898 మంది ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కెసిఆర్ ప్రకటించిన ఈ ఉచిత ఎరువు విధానం వల్ల రైతాంగ సంక్షోభం తగ్గడమేగాకుండా, ఆత్మహత్యలను గణనీయంగా నివారించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయ.
ఉచిత ఎరువు పథకంలో భాగంగా ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో 4 వేల రూపాయలను జమ చేస్తారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా 26 లక్షల టన్నుల ఎరువులను రైతులకు సరఫరా చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. కాగా, 2014 ఎన్నికలకు ముందు రైతులకు రుణ మాఫీ కింద 17 వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని టిఆర్‌ఎస్ ప్రకటించి, ఆ హామీని నిలబెట్టుకుంది. విడతలవారీగా జరుగుతున్న ఈ రుణ మాఫీ ప్రస్తుత 2017-18 ఆర్థిక సంవత్సరంలో అందించే నాలుగో విడతతో పూర్తవుతుంది. దీంతో వచ్చే 2018-19 బడ్జెట్‌లో ఆ మేరకు రుణ మాఫీ నిధులు మిగిలిపోతాయి. దీంతోనే రైతులకు ఉచిత ఎరువు పథకాన్ని ఆఫర్ చేశారని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అయతే ప్రభుత్వ లక్ష్యమే దైనా రాష్ట్ర ఆర్థిక రంగంపై సబ్సిడీల భారం తప్పక పడనుంది. ఇప్పటికే ఆసరా పెన్షన్ల కింద సాలీనా 5,330 కోట్ల రూపాయలను ఇస్తున్నారు.
డబుల్ బెడ్‌రూం పథకం కింద 12 వేల కోట్ల రూపాయలు, విద్యుత్ సబ్సిడీ కింద 4,500 కోట్ల రూపాయలు, కొత్తగా ప్రవేశపెట్టిన గొర్రెల పెంపకం పథకానికి 4 వేల కోట్ల రూపాయలు, సెలూన్ల ఆధునికీకరణ కింద 300 కోట్ల రూపాయలు, కెసిఆర్ కిట్స్, నగదు కింద గర్భవతులైన మహిళలకు ఇచ్చే ప్రోత్సాహకాలు సాలీనా 1,200 కోట్ల రూపాయలు, ఆహార సబ్సిడీ కింద యేటా మరో 2 వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ఖజనాపై పడుతోంది. అదనంగా ఇప్పుడీ ఉచిత ఎరువుల కింద సాలీనా 8 వేల కోట్ల రూపాయల భారం పడనుంది.
అలాగే రాష్ట్రంలో ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తారు. దీనికి దాదాపు 12 వేల కోట్ల రూపాయల ఖర్చవుతుంది. ఈ పథకం ఇంకా ప్రారంభం కాలేదు. మరోవైపు ఫీజు రీయంబర్స్‌మెంట్ కింద సాలీనా 700 కోట్ల రూపాయల వరకు ప్రభుత్వం భరిస్తోంది. ఈ క్రమంలో పెరుగుతున్న సబ్సిడీలు చూస్తుంటే 2018-19లో ఈ పథకాల అమలు కత్తిమీద సాములా తయారవుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. రాష్ట్రంలో సామాజిక సేవల కింద రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత 2017-18 ఆర్థిక సంవత్సరం లో 49,174.40 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాలని నిర్ణయించింది.
ప్రగతి పద్దులో ఇది మొత్తం 41.86 శాతంగా ఉంది. ఇక విద్యుత్ సబ్సిడీ వాటా 4.07 శాతంగా ఉంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరంలో సామాజిక సంక్షేమ రంగం కింద 30,466 కోట్ల రూపాయలను, 2016-17 ఆర్థిక సంవత్సరం లో 39,677.09 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టింది. అయతే ప్రతి సంవత్సరం సామాజిక సేవల ఖర్చు పెరుగుతూనే పోతుండటం గమనార్హం.