జాతీయ వార్తలు

రాష్టప్రతి, మంత్రులు ఇక హిందీలో మాట్లాడవచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: రాష్టప్రతి, కేంద్ర మంత్రులు ఇకపై తమ ప్రసంగాలను జాతీయ భాష హిందీలో చేయవచ్చు. పార్లమెంటరీ ప్యానెల్ చేసిన సిఫార్సులను రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదిస్తే ఇకపై అంతా హిందీలోనే అంతా ప్రసంగాలు చేయాల్సి ఉంటుంది. అధికార భాషపై పార్లమెంట్ కమిటీ చేసిన 9వ నివేదికలో చాలా అంశాలను ఇప్పటికే ప్రణబ్ ఆమోదించారు. ఈ నివేదిక 2011లో పార్లమెంట్‌కు సమర్పించారు. ఈ అంశాన్ని కూడా ఆమోదిస్తే ఇకపై మంత్రులు తాము చేసే ఏ ప్రసంగమైనా, ప్రకటన అయినా హిందీలోనే చేయాల్సి ఉంటుంది. భారత విమానాల్లో హిందీలో కూడా ప్రకటనలు చేయడం తప్పనిసరి అవుతుంది. విమానాల్లో హిందీ పేపర్లు, మ్యాగజైన్లు అందుబాటులోకి తీసుకురావాలని, ఎయిర్‌లైన్స్‌లో పూర్తిగా నిర్లక్ష్యం వహించిన హిందీకి ప్రాభవం తీసుకురావాలని కమిటీ నివేదిక ఇచ్చింది. ఈ సిఫార్సులను ఆమోదించాలని పౌర విమానయాన శాఖను ప్రభుత్వం కోరింది. అన్ని విమాన టిక్కెట్లపై కూడా హిందీని ఎక్కువగా వాడాలన్న సిఫార్సును కూడా రాష్టప్రతి ఆమోదించారు. లాల్‌బహదూర్ శాస్ర్తీ జాతీయ పరిపాలన అకాడమీలో హిందీలో స్టడీ మెటీరియల్‌ను అందుబాటులో ఉంచాలన్న సిఫార్సు కూడా ఆమోదం పొందింది.
సిబిఎస్‌ఈ, కేంద్రీయ విద్యా సంఘటన్ సెలబస్‌లో హిందీ తప్పనిసరి సబ్జెక్ట్ చేయాలన్న సిఫార్సును ఆమోదించారు. హిందీ అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తుంది.