బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: మధ్యశ్రేణి ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్.. నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో గతంతో పోల్చితే 30 శాతం పెరిగింది. 914.1 కోట్ల రూపాయలుగా నమోదైంది. అయితే ఇదే సమయంలో మొండి బకాయిలు కూడా రెండింతలు పెరగడం గమనార్హం. ఓ సిమెంట్ సంస్థకు చెందినదే ఇందులో 227.9 కోట్ల రూపాయలుగా ఉంది. సాధారణంగా మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు) ప్రభుత్వరంగ బ్యాంకుల్లో అధికంగా పెరుగుతాయి. ప్రైవేట్‌రంగ బ్యాంకుల్లో తక్కువే. అయితే యెస్ బ్యాంక్ ఇందుకు మినహాయింపునిచ్చింది. ఇకపోతే ఇదే సిమెంట్ సంస్థ ఇండస్‌ఇండ్ బ్యాంక్‌కు కూడా 122 కోట్ల రూపాయల మేర బకాయిపడింది. ఇదిలావుంటే యెస్ బ్యాంక్ ఆదాయం ఈ జనవరి-మార్చిలో 1,639.7 కోట్ల రూపాయలుగా ఉన్నట్లు బుధవారం చెపింది.
ఇండస్‌ఇండ్ బ్యాంక్
ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఇండస్‌ఇండ్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 751.61 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 620.35 కోట్ల రూపాయల లాభాన్ని అందుకుంది. ఆదాయం ఈసారి 5,041.31 కోట్ల రూపాయలుగా, పోయినసారి 4,120.16 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు సంస్థ బుధవారం తెలియజేసింది.
గృహ్ ఫైనాన్స్
మార్ట్‌గేజ్ లెండర్ హెచ్‌డిఎఫ్‌సి లిమిటెడ్ అనుబంధ సంస్థ గృహ్ ఫైనాన్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 110.45 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 87.82 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 416.11 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 366.91 కోట్ల రూపాయలుగా ఉంది.
రిలయన్స్ ఇన్‌ఫ్రా
అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 40.94 కోట్ల రూపాయలుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 327.41 కోట్ల రూపాయల నికర నష్టం పాలైంది. ఆదాయం ఈసారి 6,145 కోట్ల రూపాయలుగా, పోయినసారి 6,910 కోట్ల రూపాయలుగా ఉంది.
నెట్‌వర్క్18 మీడియా
మీడియా సంస్థ నెట్‌వర్క్18 మీడియా అండ్ ఇనె్వస్ట్‌మెంట్స్ లిమిటెడ్ ఏకీకృత నష్టం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 33.31 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 24.98 కోట్ల రూపాయల నష్టాన్ని అందుకుంది. ఏకీకృత ఆదాయం ఈసారి 434.50 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 454.59 కోట్ల రూపాయలుగా ఉంది.
టివి18 బ్రాడ్‌కాస్ట్
టివి18 బ్రాడ్‌కాస్ట్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 8.39 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో సంస్థ లాభం 82.85 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 297.67 కోట్ల రూపాయలుగా, పోయినసారి 302.21 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు బుధవారం సంస్థ తెలియజేసింది.