బిజినెస్

హెచ్-1బి వీసాలపై అమెరికాతో జైట్లీ చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 23: హెచ్-1బి వీసా విధానం కఠినతరం అంశాన్ని అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్టీవెన్ మ్నుచిన్ వద్ద కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ లేవనెత్తారు. భారతీయ ఐటి రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్న ఈ నిర్ణయంపట్ల ఆందోళన వ్యక్తం చేశారు. జైట్లీ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నది తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారతీయ సంస్థలు, నిపుణులు చేస్తున్న కృషిని మ్నుచిన్‌కు వివరించారు. మరోవైపు భారతీయ ఐటి రంగంలో అగ్రశ్రేణి సంస్థలైన టిసిఎస్, ఇన్ఫోసిస్‌లు హెచ్-1బి వీసా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడుతున్నాయని అమెరికా ఆరోపించింది. ఇదిలావుంటే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వృద్ధిరేటును సాధిస్తున్న భారత్.. ఆ దూకుడును ఇకపైనా కొనసాగిస్తుందని, వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలుతో జిడిపి మరింతగా పరుగులు పెట్టగలదన్న విశ్వాసాన్ని జైట్లీ వ్యక్తం చేశారు. పాత పెద్ద నోట్ల రద్దును సమర్థించుకున్న ఆయన దీనివల్ల నకిలీ కరెన్సీకి, తీవ్రవాదానికి అడ్డుకట్ట పడిందన్నారు. కాగా, అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) కోటా సంస్కరణల అమల్లో మందగమనంపట్ల జైట్లీ ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్, ముఖ్య ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యన్ కూడా పాల్గొన్నారు. జి-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం, ఐఎమ్‌ఎఫ్, ప్రపంచ బ్యాంక్ సమావేశాల్లో వీరందరూ పాల్గొంటారు.