బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎసిసి లిమిటెడ్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: సిమెంట్ తయారీ సంస్థ ఎసిసి లిమిటెడ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 211.06 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి వ్యవధిలో ఇది 231.70 కోట్ల రూపాయలుగా ఉండగా, ఈసారి 8.90 శాతం తగ్గినట్లైంది. ఆదాయం ఈసారి 3,663.18 కోట్ల రూపాయలుగా, పోయినసారి 3,323.17 కోట్ల రూపాయలుగా ఉందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలియజేసింది. అమ్మకాలు కూడా క్రిందటిసారితో పోల్చితే 3.77 శాతం పెరిగి 6.36 మిలియన్ టన్నుల నుంచి 6.60 మిలియన్ టన్నులకు చేరాయి.
టాటా మెటాలిక్స్
టాటా స్టీల్ అనుబంధ సంస్థ అయిన టాటా మెటాలిక్స్ పన్ను అనంతర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 6 శాతం పెరిగి 40 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 38.19 కోట్ల రూపాయలుగా ఉంది. టర్నోవర్ ఈసారి 415 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 380 కోట్ల రూపాయలుగా ఉంది.
మహీంద్ర లైఫ్‌స్పేసెస్
నిర్మాణ రంగ సంస్థ మహీంద్ర లైఫ్‌స్పేసెస్ డెవలపర్స్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో గతంతో పోల్చితే భారీగా క్షీణించింది. 17.4 కోట్ల రూపాయలుగానే నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 48.51 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి 64 శాతం పతనమైనట్లైంది. అయితే ఆదాయం మాత్రం ఈసారి 342.47 కోట్ల రూపాయలకు పెరిగింది. పోయినసారి 164.71 కోట్ల రూపాయలకే పరిమితమైందని బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు సంస్థ తెలియజేసింది.