బిజినెస్

వికసించని విప్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఏప్రిల్ 25: దేశీయ ఐటి రంగంలో మూడో అతిపెద్ద సంస్థ అయిన విప్రో ఏకీకృత లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 2,267 కోట్ల రూపాయలుగానే నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 2,257.3 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి వృద్ధి స్వల్పంగానే తేలింది. పట్టుమని 10 కోట్ల రూపాయలు కూడా లాభం పెరగలేదు. ఇక ఆదాయం ఈసారి 15,033.8 కోట్ల రూపాయలుగా ఉంటే, పోయినసారి 14,312.7 కోట్ల రూపాయలుగా ఉంది. ఈ మేరకు మంగళవారం విప్రో సంస్థ తెలియజేసింది. ఇదిలావుంటే రాబోయే రెండు నెలల్లో బోనస్ షేర్లను జారీ చేస్తామని చెప్పింది. వాటాదారులకు లాభం కలిగించేలా ఇప్పటికే దేశీయ ఐటి రంగంలో అతిపెద్ద సంస్థ అయిన టిసిఎస్, రెండో అతిపెద్ద సంస్థ అయిన ఇన్ఫోసిస్ మెగా షేర్ బైబ్యాక్‌లను ప్రకటించాయి. ఈ నేపథ్యంలో విప్రో సైతం బోనస్ షేర్లతో తమ భాగస్వాములకు లాభం చేకూర్చనుంది. ప్రతీ షేర్‌కు మరొక షేర్‌ను అందివ్వనుంది. ముఖ్యంగా ఇది చిన్న మదుపరులను ప్రోత్సహించినట్లవుతుందని, రిటైల్ షేర్‌హోల్డర్ల ప్రాతినిథ్య విస్తరణకు, ద్రవ్యలభ్యతకూ దోహదపడుతుందని విప్రో ఈ సందర్భంగా అభిప్రాయపడింది. నిజానికి బోనస్ షేర్ల జారీ అంశం బోర్డు సమావేశంలో భాగంగానే లేదని, అయినప్పటికీ మదుపరుల ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్న నిర్ణయమని చెప్పుకొచ్చింది. కాగా, ఈ మార్చి 31తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం అంతకుముందుతో పోల్చితే సుమారు 5 శాతం పడిపోయి 8,518 కోట్ల రూపాయలుగా నమోదైంది. ఆదాయం మాత్రం 7.4 శాతం పెరిగి 57,995 కోట్ల రూపాయలకు చేరింది. ఇకపోతే డాలర్లపరంగా ప్రస్తుత త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో సంస్థ ఐటి సేవల విభాగం నుంచి ఆదాయం 1,915-1,955 మిలియన్ డాలర్ల మధ్య నమోదు కావచ్చని విప్రో అంచనా వేసింది. ఈ జనవరి-మార్చిలో 1,954.6 మిలియన్ డాలర్లుగా ఉంది.
అమెరికా ఉద్యోగాల్లో
స్థానికులకు పెద్దపీట
హెచ్-1బి వీసా నిబంధనల కఠినతరం నేపథ్యంలో అమెరికా ఉద్యోగాల్లో స్థానికులకు ప్రాధాన్యమిస్తోంది విప్రో. ఉద్యోగుల్లో జూన్ నాటికి 50 శాతానికిపైగా అక్కడివారే ఉంటారన్న అంచనాను వెలిబుచ్చింది. భారతీయ ఐటి రంగ సంస్థలకు అమెరికానే అతిపెద్ద మార్కెట్ అన్నది తెలిసిందే. అయితే భారత ఐటి సంస్థల వల్ల స్థానికులు నిరుద్యోగులు అవుతున్నారని, ఔట్‌సోర్సింగ్‌కు అమెరికన్లనే ఉద్యోగులుగా తీసుకోవాలంటూ ట్రంప్ సర్కారు హెచ్-1బి వీసా నిబంధనలను కఠినతరం చేసింది. హెచ్-1బి వీసాల ఆధారంగానే భారత ఐటి సంస్థలు తమ ఉద్యోగులను అక్కడి పని కోసం భారత్ నుంచి పంపుతున్నది తెలిసిందే. హెచ్-1బి వీసాలు పొందడం కష్టం కావడంతో అక్కడివారినే ఇప్పుడు భారత ఐటి సంస్థలు ఉద్యోగులుగా నియమించుకుంటున్నాయి. అత్యవసరమైన విభాగాల్లో మాత్రమే భారతీయులను తీసుకుంటున్నాయి. కాగా, టిసిఎస్, ఇన్ఫోసిస్‌లు హెచ్-1బి వీసా నిబంధనలను ఉల్లంఘించాయని అమెరికా ఆరోపించగా, దాన్ని భారత ఐటి సంస్థల సంఘం నాస్కామ్ తోసిపుచ్చింది. అమెరికా ఆరోపించినట్లుగా హెచ్-1బి వీసాల్లో టిసిఎస్, ఇన్ఫోసిస్‌లదే అగ్రభాగం కాదని, కేవలం వాటి వాటా 8.8 శాతంగానే ఉందంటూ 2014-15 ఆర్థిక సంవత్సరం గణాంకాలను వెల్లడించింది.