బిజినెస్

నిఫ్టీ సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఏప్రిల్ 25: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా లాభాల్లోనే ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) లాభాలు మదుపరులను కొనుగోళ్ల దిశగా నడిపించాయి. ఫలితంగా సూచీలు పరుగులు పెట్టగా, మూడు వారాల గరిష్ఠ స్థాయిని అందుకున్నాయి. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ ఆల్‌టైమ్ హైకి చేరింది. తొలిసారిగా 9,300 మార్కును అధిగమించింది. 88.65 పాయింట్ల లాభంతో 9,306.60 వద్ద నిలిచింది. దీంతో ఈ నెల 5న నమోదైన 9,265.15 పాయింట్ల ఆల్‌టైమ్ రికార్డు చెరిగిపోయినట్లైంది. ఇక మంగళవారం ట్రేడింగ్‌లో ఒక దశలో 9,309.20 పాయింట్లను తాకింది. దీంతో ఏప్రిల్ 5 నాటి 9,273.90 పాయింట్ల ఇంట్రా-డే రికార్డు కూడా కనుమరుగైపోయింది. మరోవైపు బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ సైతం 30 వేల దరిదాపుల్లోకి వెళ్లింది. 287.40 పాయింట్లు ఎగిసి 29,943.24 వద్ద స్థిరపడింది. మంగళవారం ట్రేడింగ్‌లో సెనె్సక్స్ గరిష్ఠ స్థాయి 29,961.82 పాయింట్లవగా, కనిష్ట స్థాయి 29,780.84 పాయింట్లు. సోమవారం కూడా సెనె్సక్స్ 290.54 పాయింట్లు ఎగబాకగా, నిఫ్టీ 98.55 పాయింట్లు ఎగిసింది. కాగా, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 21 నెలల గరిష్ఠాన్ని తాకడం కూడా మదుపరులను పెట్టుబడుల వైపు నడిపించింది. మంగళవారం ఫారెక్స్ ట్రేడింగ్‌లో 18 పైసలు బలపడి 64.26 స్థాయికి చేరింది రూపాయి విలువ. ఎగుమతిదారులు, కార్పొరేట్లు డాలర్లను అమ్మకానికి పెట్టారు. ఇకపోతే టెలికామ్, ఎఫ్‌ఎమ్‌సిజి, రియల్టీ, చమురు, గ్యాస్, ఎనర్జీ, ఫైనాన్స్, ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ జనవరి-మార్చిలో రిలయన్స్ లాభం రికార్డు స్థాయిలో 8,046 కోట్ల రూపాయలుగా నమోదు కావడంతో మదుపరులు ఆ సంస్థ షేర్ల కొనుగోలుకు అమితాసక్తిని కనబరిచారు. దీంతో రిలయన్స్ మార్కెట్ విలువ మరో 5,242.44 కోట్ల రూపాయలు ఎగిసింది. సోమవారం కూడా పెరగగా, దేశీయ ఐటి రంగ దిగ్గజం టిసిఎస్‌ను వెనక్కినెట్టి మార్కెట్ లీడర్‌గా అవతరించినది తెలిసిందే. మంగళవారం టిసిఎస్ షేర్ల విలువ 0.76 శాతం క్షీణించింది. మరోవైపు బయోకాన్ మార్కెట్ విలువ సైతం 1,994 కోట్ల రూపాయలు పెరిగింది. ఇక అంతర్జాతీయంగా ఆసియా మార్కెట్లలో చైనా, హాంకాంగ్, జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్ సూచీలు లాభాల్లో ముగిశాయి. ఐరోపా మార్కెట్లలోనూ ప్రధానమైన ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ సూచీలు లాభాలను అందుకున్నాయి. అమెరికా స్టాక్ మార్కెట్లూ లాభాల్లోనే పయనించాయి. నాస్‌డాక్ తొలిసారిగా 6,000 పాయింట్లను అధిగమించింది. 6,008.62 వద్ద స్థిరపడింది.
రికార్డుస్థాయికి
బిఎస్‌ఇ మార్కెట్ విలువ
మరోవైపు తాజా లాభాల నేపథ్యంలో బిఎస్‌ఇ మార్కెట్ విలువ రికార్డు స్థాయికి చేరింది. 125 లక్షల కోట్ల రూపాయలకుపైగా నమోదైంది. టెలికామ్, ఎఫ్‌ఎమ్‌సిజి, రియల్టీ, రంగాల షేర్లు మదుపరులను ఆకట్టుకోవడంతో సూచీ భారీ లాభాల దిశగా పరుగులు పెట్టింది. ఫలితంగా బిఎస్‌ఇలోని సంస్థల విలువ 1,25,53,561 కోట్ల రూపాయలకు చేరింది.