బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాక్సిస్ బ్యాంక్
న్యూఢిల్లీ/ముంబయ, ఏప్రిల్ 26: దేశీయ ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ, మూడో అతిపెద్ద ప్రైవేట్‌రంగ బ్యాంకైన యాక్సిస్ బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 1,225.10 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 2,154.28 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి 43 శాతం క్షీణించినట్లైంది. ఆదాయం ఈసారి 14,181.31 కోట్ల రూపాయలుగా, పోయినసారి 13,592.97 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్
ఎల్‌ఐసి హౌసింగ్ ఫైనాన్స్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 529.19 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 448.02 కోట్ల రూపాయలుగా ఉంది. దీంతో ఈసారి 18.1 శాతం వృద్ధి నమోదైనట్లైంది. ఆదాయం ఈసారి 3,661.86 కోట్ల రూపాయలుగా, పోయినసారి 3,273.94 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్
ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో స్వల్పంగా పెరిగి 408.2 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 403 కోట్ల రూపాయలుగా ఉంది. మొత్తం గత ఆర్థిక సంవత్సరం సంస్థ లాభం 1,682 కోట్ల రూపాయలుగా ఉండగా, అంతకుముందు ఆర్థిక సంవత్సరం 1,650 కోట్ల రూపాయలుగా ఉంది.
ఇండియన్ బ్యాంక్
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఇండియన్ బ్యాంక్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో మూడింతలకుపైగా పెరిగి 319.70 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 93.62 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 4,601.89 కోట్ల రూపాయలుగా, పోయినసారి 4,522.73 కోట్ల రూపాయలని సంస్థ తెలియజేసింది.
మహీంద్ర ఫైనాన్స్
మహీంద్ర అండ్ మహీంద్ర ఫైనాన్షియల్ సర్వీసెస్ (మహీంద్ర ఫైనాన్స్) స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 37 శాతం క్షీణించి 234 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 370 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 1,843 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 1,690 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
ఐడిఎఫ్‌సి బ్యాంక్
ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిఎఫ్‌సి బ్యాంక్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 176 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చితో పోల్చితే ఇది 6.6 శాతం అధికం. ఆదాయం ఈసారి 515.6 కోట్ల రూపాయలుగా, పోయినసారి 403.8 కోట్ల రూపాయలుగా ఉందని వివరించింది.
రిలయన్స్ హోమ్ ఫైనాన్స్
రిలయన్స్ క్యాపిటల్ అనుబంధ సంస్థ అయన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 173 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 87 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి గతంతో పోల్చితే 40 శాతం పెరిగి 1,145 కోట్ల రూపాయలుగా నమోదైంది.
వెల్‌స్పన్ ఇండియా
టెక్స్‌టైల్స్ సంస్థ వెల్‌స్పన్ ఇండియా నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 154.48 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 199.53 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 1,772.71 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,639.38 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలియజేసింది.
పర్సిస్టెంట్ సిస్టమ్స్
ఐటి రంగ సంస్థ అయన పర్సిస్టెంట్ సిస్టమ్స్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 72.7 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 73 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి గతంతో పోల్చితే 7.3 శాతం పెరిగి 727.1 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 677.1 కోట్ల రూపాయలుగా ఉంది.
కెన్ ఫిన్ హోమ్స్
ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ స్పాన్సర్ చేస్తున్న కెన్ ఫిన్ హోమ్స్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 70.86 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో 47.45 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 361.48 కోట్ల రూపాయలుగా, పోయినసారి 295.27 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలియజేసింది.
జెన్సర్ టెక్నాలజీస్
మధ్యశ్రేణి సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ జెన్సర్ టెక్నాలజీస్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 84.44 శాతం పతనమై 10.73 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో 68.96 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 743.77 కోట్ల రూపాయలుగా అంతకుముందు ఆర్థిక సంవత్సరం 744.71 కోట్ల రూపాయలుగా ఉంది.