బిజినెస్

అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై అమెరికా సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 29: అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను సమీక్షించాలని అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులను ఆదేశించారు. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ)తోసహా అన్ని దేశాలు, సంస్థలతో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందాలను క్షుణ్ణంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. వాణిజ్య నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని భావించే ట్రంప్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను జారీ చేశారు. వైట్‌హౌస్ న్యూస్ కాన్ఫరెన్స్‌లో అమెరికా వాణిజ్య మంత్రి విల్బర్ రాస్ విలేఖరులతో మాట్లాడుతూ 180 రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని అధ్యక్షుడు చెప్పినట్లు తెలిపారు. అమెరికా ప్రయోజనాల రక్షణే తమ తొలి ప్రాధాన్యతన్నారు.