బిజినెస్

త్రైమాసిక ఆర్థిక ఫలితాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చోళమండలం ఇనె్వస్ట్‌మెంట్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: చోళమండలం ఇనె్వస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్స్ పన్ను అనంతర లాభంగత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 14 శాతం పెరిగి 220 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చి త్రైమాసికంలో ఇది 192 కోట్ల రూపాయలుగా ఉంది.
ఉత్తమ్ గాల్వ స్టీల్స్
ఉత్తమ్ గాల్వ స్టీల్స్ స్టాండలోన్ నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 138.89 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 671.47 కోట్ల రూపాయల నష్టాన్ని అందుకుంది. నికర అమ్మకాలు ఈసారి 893.94 కోట్ల రూపాయలుగా, పోయినసారి 1,724.87 కోట్ల రూపాయలని సంస్థ తెలియజేసింది.
స్టెరిలైట్ టెక్
స్టెరిలైట్ టెక్ ఏకీకృత నికర లాభంగత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 16.27 శాతం పెరిగి 63.66 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 54.75 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 707 కోట్ల రూపాయలుగా, పోయినసారి 614 కోట్ల రూపాయలని సంస్థ తెలియజేసింది.
లక్ష్మీ విలాస్ బ్యాంక్
ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్ సంస్థ లక్ష్మీ విలాస్ బ్యాంక్ నికర లాభంగత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 6.3 శాతం పెరిగి 52.16 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 49.07 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 864.99 కోట్ల రూపాయలుగా, పోయినసారి 758.84 కోట్ల రూపాయలని సంస్థ తెలియజేసింది.
జిఐసి హౌసింగ్ ఫైనాన్స్
జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ నికర లాభంగత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 24.4 శాతం పెరిగి 46.61 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 35.87 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 266.63 కోట్ల రూపాయలుగా, పోయినసారి 233.48 కోట్ల రూపాయలని సంస్థ తెలియజేసింది.
రేమాండ్
రేమాండ్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 38.03 శాతం పడిపోయ 33.68 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 54.35 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 1,473.60 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 1,402.05 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ
జెఎస్‌డబ్ల్యు ఎనర్జీ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 91.74 శాతం క్షీణించి 24.76 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 299.94 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 1,862.06 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 2,630.71 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
టాటా స్పాంజ్ ఐరన్
టాటా స్పాంజ్ ఐరన్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) ఆఖరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 62 శాతం పెరిగి 21.20 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 13.08 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 194.68 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 165.27 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.
ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్
ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏకీకృత నికర లాభం గత ఆర్థిక సంవత్సరం (2016-17) చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో 64.76 శాతం క్షీణించి 19.35 కోట్ల రూపాయలుగా నమోదైంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2015-16) జనవరి-మార్చిలో ఇది 54.91 కోట్ల రూపాయలుగా ఉంది. ఆదాయం ఈసారి 297.97 కోట్ల రూపాయలుగా, క్రిందటిసారి 128.31 కోట్ల రూపాయలుగా ఉందని సంస్థ తెలిపింది.