బిజినెస్

అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: మనీ లాండరింగ్, పన్ను ఎగవేతలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేలా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడి) తన అధికారాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టిస్తే, ఖజానా అంతా సక్రమ సంపదతోనే నిండిపోతుందని, అయితే ఇందుకు ఈడి కఠిన వైఖరిని అవలంభించడం చాలా ముఖ్యమని చెప్పారు. శనివారం ఇక్కడ ఎన్‌ఫోర్స్‌మెంట్ డే సందర్భంగా మాట్లాడిన ఆయన పన్ను చట్టాల అమల్లో లోపాలు.. దేశ ప్రయోజనాలను ఆటంక పరుస్తున్నాయని తెలిపారు.
మరోవైపు దాదాపు 9 లక్షల గుర్తింపు పొందిన సంస్థలు తమ వార్షిక ఆదాయ వివరాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు తెలియపరచడం లేదని రెవిన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. మొత్తం 15 లక్షల సంస్థల్లో 6 లక్షల సంస్థలు మాత్రమే తమ రిటర్న్స్‌ను దాఖలు చేస్తున్నాయని చెప్పారు. దీంతో మనీ లాండరింగ్‌కు అవకాశాలున్నాయన్న ఆయన టాస్క్ ఫోర్స్ ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తోందన్నారు. కాగా, 3 లక్షల సంస్థలకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటీసులు జారీ చేసిందని చెప్పారు.